Breaking: హైదరాబాద్ గోషామహాల్ చక్నవాడిలో పెద్ద నాలా ఒక్కసారిగా కుంగిపోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ నాలా శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడ ఉన్న కూరగాయల దుకాణాలు, బైక్ లు, కార్లు ధ్వంసం అయ్యాయి. పలువురు వినియోగదారులు, వ్యాపారులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రతి శుక్రవారం చక్నవాడీ లో పెద్ద నాలాపై మార్కెట్ నిర్వహిస్తుంటారు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత మార్కెట్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో కొనుగోలు దారులు అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో దాదాపు కిలో మీటరు మేర నాలా కుంగిపోయింది. విషయం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందితో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ హఠాత్పరిణామంతో వ్యాపారులు, కొనుగోలు దారులు ఆందోళనకు గురైయ్యారు.