తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం అందరికీ తెలిసిందే. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ తీవ్రంగా పెరిగింది. సీఎం కేసిఆర్ రాజ్ భవన్ గడప తొక్కేందుకే ఇష్ట పడటం లేదు. రీసెంట్ గా రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం కేసిఆర్ హజరు కాలేదు. మంత్రులను పంపలేదు. అదే విధంగా ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. సీఎం కేసిఆర్ సహా మంత్రులు గవర్నర్ వ్యవస్థనే తప్పుబడుతూ విమర్శలు సంధిస్తున్నారు. రాజ్ భవన్ అంటే గౌరవం లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తుందనీ, గవర్నర్ పర్యటనలకు సంబంధించి ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై విమర్శిస్తున్నారు. సర్కార్ వర్సెస్ గవర్నర్ లా పరిస్థితి మారడంతో బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.

ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత బడ్జెట్ సిఫారసుకు అనుమతి కోరుతూ గవర్నర్ తమిళి సైకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. శుక్రవారం నుండి సమావేశాలు ప్రారంభించి, తొలి రోజునే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదు. రాజ్యాంగంలోని 202 ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ విధిగా సిఫారసు చేయాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.
గవర్నర్ నుండి ఆమోదం రాకపోవడం, సమావేశాల తేదీ దగ్గర పడుతుండటంతో ఏమి చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ఇందుకు సంబంధించి సంప్రదింపుల జరుపుతున్నట్లు తెలుస్తొంది. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆ అంశంపై హైకోర్టులో ప్రభుత్వం ఇవేళ లంచ్ మోష్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
ఉభయ సభలు ఇంకా ప్రొరోగ్ కాకపోవడంతో గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగానే ఈసారి కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపరుస్తున్నారు దీంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం ఉండదు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై ఇంకా అనుమతి ఇవ్వలేదు. గత బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు.
బడ్జెట్ సిఫారసు చేసేందుకు కొంత సమయం తీసుకునే స్వేచ్చ తనకు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని రాజ్యాంగానికి లోబడి ఆర్ధిక బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చినట్లుగా అప్పట్లో గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీ సర్కార్ కీలక నిర్ణయం