ఆ యువకుడికి గతంలో ఎటువంటి నేరచరిత్ర లేదు. కానీ తన స్నేహితుడైన యువకుడిని పాశవికంగా హత్య చేశాడు. అతను హంతకుడిగా మారడానికి కారణం ఒక యువతి. తను ప్రేమించి యువతి తన స్నేహితుడితో చనువుగా ఉండటంతో అతనిపై కోపం పెంచుకున్నాడు. అతన్ని అడ్డుతొలగించుకుంటే తన ప్రేయసి తనకు దగ్గర అవుతుందని భావించాడు. నల్లగొండ ఎంజీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాలో ఫైనల్ ఇయర్ చదువుతున్న నవీన్ ను అతని స్నేహితుడే అయిన హరిహర కృష్ణ అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వీరి మధ్య వివాదం మొదలైంది. ఈ విషయంపై పలు మార్లు గొడవపడ్డారు.

ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన పార్టీ చేసుకునేందుకు అబ్దుల్లాపుర్ మెంట్ లోని వారి ప్రెండ్ రూమ్ కి హరి హరకృష్ణ, నవీన్ వెళ్లారు. అక్కడే మధ్యం సేవించారు. అనంతరం బైక్ పై ఓఆర్ఆర్ సమీపంలో చెట్ల పొదల వద్దకు నవీన్ ను తీసుకువచ్చి హరికృష్ణ హత్య చేశారు. పోలీసులు హరిహరకృష్ణను అదుపులోకి విచారించగా, సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నవీన్ మృతి చెందిన తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో తల, మొండెం వేరు చేశాడు. ఆ తర్వాత నవీన్ గుండెను చీల్చాడు. మర్మాంగాలను కోశాడు, నవీన్ చేతి వేళ్లను కట్ చేశారు. ఆ తర్వాత ఆ ఫోటోలను ఆ అమ్మాయి (లవర్) కు పంపించాడు. అతను పంపిన వాట్సాప్ సందేశాలు చూస్తే అతని సైకో మనస్థత్వం బయటపడింది.
కాగా నవీన్ ను హత్య చేయాలని హరిహర కృష్ణ మూడు నెలల క్రితమే ప్లాన్ చేశాడుటయ. ఆ క్రమంలోనే రెండు నెలల క్రితం కత్తిని కొనుగోలు చేశాడు. హత్యకు ముందు క్రైమ్ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు నిందితుడిని పోలీసులు కోర్టులో హజరుపర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై..? కీలక ప్రకటన చేసిన సోనియా గాంధీ