టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ వ్యవహారం తెలంగాణలో తీవ్ర సంచలనం అయ్యింది. పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ క్రమంలో హ్యాకింగ్ జరగలేదని రూఢీ అయ్యింది. అయితే ఓ యువతి కోసం టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి పేపర్ లీక్ చేసినట్లుగా తెలుస్తొంది. టీఎస్‌పీఎస్సీ నేడు నిర్వహించాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న పరీక్షల ప్రశ్నల సాఫ్ట్ కాపీ వివరాలు బయటకు రావడంతో పరీక్షను వాయిదా వేశారు. కంప్యూటర్ల హ్యాకింగ్ జరిగినట్లు భావించి ఈ నెల 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను వాయిదా వేసింది టీఎస్‌పీఎస్సీ. ఈ పోస్టులకు రాత పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అయితే టీఎస్పీఎస్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, దర్యాప్తులో హానీ ట్రాప్ జరిగినట్లుగా తెలుస్తొంది.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ఇటీవల తరచుగా ఓ యువతి రావడాన్ని గమనించారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్ కోసం సదరు యువతి తరుచూ ఆఫీసుకు వస్తూ కలుస్తొంది. ప్రవీణ్ కుమార్ ను ముగ్గులోకి దింపిన ఆ యువతి సన్నిహితంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే తనకు పేపర్ ఇవ్వాలని కోరగా, ఆమె కోసం ప్రవీణ్ కుమార్ టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ చేసినట్లుగా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.