Huzurabad By Poll: హూజూరాబాద్ లో బీజెపీ నేతలు అడుగుపెట్టాలంటే ముందు ఆ పని చేయాలంట..

Share

Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు, బీజేపీ నేత ఈటల రాజేంద్ర మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. నేతల ఎన్నికల ప్రచారం, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం హీట్ ఎక్కింది. ఈ సందర్భంలో మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ తనను తిట్టే బదులు, చేతనైతే కేంద్రంతో మాట్లాడి నూతన రైతు చట్టాలను రద్దు చేయించాలని హరీష్ రావు కోరారు.

Huzurabad By Poll: minister harish rao comments on new agricultural acts
Huzurabad By Poll: minister harish rao comments on new agricultural acts

బీజేపీ తెచ్చిన రైతు చట్టాలను నల్ల చట్టాలని గతంలో ఈటల రాజేందర్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ నాడు ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతానని కూడా చెప్పారన్నారు. రైతులను ఓట్లు అడిగే హక్కు ఒక్క టీఆర్ఎస్ పార్టీకే ఉందని హరీష్ పేర్కొంటూ, బీజేపీ నేతలు హుజూరాబాద్ అడుగు పెట్టాలంటే ముందుగా నూతన రైతు చట్టాలను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే ఓట్లు అడగాలని సూచించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతాంగం నెలల తరబడి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

నూతన రైతు చట్టాలను రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం చట్టాల రద్దుకు ససేమిరా అంటున్నది. అవసరమైతే బిల్లులో సవరణలు చేస్తామని కేంద్రం చెబుతున్నది. బిల్లులో సవరణలకు రైతు సంఘాలు ఒప్పుకోవడం లేదు. మరో పక్క హూజూరాబాద్ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం మరో రెండు నెలల వరకూ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు పండుగల సీజన్ తరువాతనే ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదా పడినట్లు తెలిసినా నియోజకవర్గంలో నేతల ప్రచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Read More: Huzurabad By Poll: రేవంత్ – ఈటల మ్యాచ్ ఫిక్సింగా..? బీజేపీ – టీఆర్ఎస్ రహస్య ఒప్పందమా..?


Share

Related posts

బాబు బండారం బ‌య‌ట‌పెట్టిన జ‌గ‌న్‌…ఇప్పుడు జ‌ర‌గ‌బోయేది అదే

sridhar

అప్పు అంటే భయమేలా… చేసేస్తే పోలా !! ఏపీ దివాళాకు సిద్ధం

Comrade CHE

Fever: జ్వరం వస్తే ఇలా చేయండి వెంటనే తగ్గిపోతుంది!!

siddhu