Huzurabad By Poll: టీఆర్ఎస్ ఓటమే టార్గెట్..! ఈటల గెలుపునకు రేవంత్ పరోక్ష మద్దతు..? ఇవీ కారణాలు..!!

Share

Huzurabad By Poll: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అనే స్లోగన్ యే వినబడుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలో కొంత జోష్ వచ్చింది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి దూరమైన వారు మళ్లీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ వ్యూహం ఏమిటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. బహుముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల   టీఆర్ఎస్‌ లాభపడే అవకాశాలు ఉంటాయి.

Huzurabad By Poll politics
Huzurabad By Poll politics

Read More: AP BJP Protests: ఏపిలో బీజేపీకి ఆందోళన అస్త్రాలను ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అయితే పోటీ రసవత్తరంగా, నువ్వానేనా ఉన్న రీతిలో ఉండే అవకాశం ఉందనీ, కాస్తంత ఈటలకే ఎడ్జ్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదీ కూడా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ అధికారాన్ని ఉపయోగించకపోతే. అధికార పార్టీ భారీ ఎత్తున తాయిలాల పంపిణీ చేస్తే  ఆ స్థాయిలో ఈటల నెట్టుకురావడం కష్టమే అన్న మాట కూడా వినబడుతోంది. సాధారణంగా ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా నూటికి 80శాతం పైగా అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో ఈటల బలమైన బీసీ నేతగా గుర్తింపు పొంది ఉండటం, వరుస విజయాలు సాధించి ఉండటం, టీఆర్ఎస్ పార్టీ ఈటలను అన్యాయం చేసిందన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల టీఆర్ఎస్ కు గెలుపు నల్లేరు పై నడక కాదని చెబుతున్నారు.

ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన అభ్యర్థిని దింపి రేవంత్ విస్తృత ప్రచారం చేస్తే అది ఇన్‌డైరెక్ట్ గా టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుంది. ఎటు లేదన్నా కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో సుమారు 50 వేల పైచిలుకు ఓటు బ్యాంకు ఉంది. బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకపోతే అది ఈటలకు లాభం చేకూరుస్తుంది. ఇది ఆలోచించే రేవంత్ రెడ్డి మొదట్లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక తన సామర్థ్యానికి పరీక్ష కాదని చెప్పేశారు. ఈటలది గెలుపు లక్ష్యం కాగా టీఆర్ఎస్ ఓటమి రేవంత్ లక్ష్యం. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి ఇప్పుడు హూజారాబాద్ లో కాంగ్రెస్  గెలుపునకు కీలకమైన వ్యూహాలు వేస్తున్నట్లు కనబడటం లేదు. అభ్యర్థి విషయంలోనూ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని సమాచారం. ఒక వేళ కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దింపినా గెలుపు అవకాశాలు లేకపోగా అది టీఆర్ఎస్ కు లాభం చేకూరుస్తుందన్న భావనతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవడం లేదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి పరోక్షంగా ఈటలకు సాయం చేయాలనే డిసైడ్ అయినట్లు కనబడుతోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనేది వేచి చూడాలి.


Share

Related posts

Eatela Rajendar: ఈట‌ల బ్యాలెన్స్ త‌ప్పుతున్నారా? ఏంటా మాట‌లు….

sridhar

Parvati Nair Gorgeous Photos

Gallery Desk

అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర !

Yandamuri