Huzurabad Bypoll: హూజూరాబాద్ లో ఓటర్లకు పండుగే పండుగ…! కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్..!!

Share

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నికలను అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ల మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉండగా ఎలాగైనా ఈటలను ఓడించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపారు. ఒక్కో ఓటుకు రూ.6వేల నుండి పది వేల వరకూ సైతం పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పక్కాగా ప్రత్యర్ధి పార్టీ సానుభూతి పరులు అని భావించిన వారికి డబ్బు పంపిణీ జరగకపోవడంతో డబ్బులు అందని వారు తమకు ఎందుకు ఇవ్వలేదంటూ నేతలను నిలదీస్తున్న పరిస్థితి కూడా ఉంది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మద్యం, మనీ, గిఫ్ట్ లు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది.

Huzurabad Bypoll: congress leader dasoju sravan serious on bjp and trs
Huzurabad Bypoll: congress leader dasoju sravan serious on bjp and trs

Huzurabad Bypoll: ఉప ఎన్నికను రద్దు చేయాలి

ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. మవోయిస్టులు గతంలో ఎప్పుడో చెప్పినట్లు ఇవి పూర్తిగా బూటకపు ఎన్నికలేనని అన్నారు. హుజూరాబాద్ లో దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టారంటూ అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవమాన పరుస్తున్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్రం నుండి వచ్చిన ముగ్గురు పరిశీలకులు అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇలా ఎన్నికలు నిర్వహించే బదులు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు వేలం నిర్వహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

భారీగా పంపిణీలు

గతంలో ఎన్నడూ లేని విధంగా హూజూరాబాద్ నియోజకవర్గంలో నగదు, చీరలు, పాత్రలు, స్పోర్ట్స్ కిట్ లు, గడియారాలు, వెండి బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, ఇతర ఖరీదైన వస్తువులు, బహుమతులు పట్టపగలు పంపిణీ చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాము చేస్తున్న ఆరోపణలకు రుజువులు కూడా చూపుతున్నామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిగణించబడుతోందని అన్నారు.


Share

Related posts

ఆ దేశంపై దాడికి వ్యూహం వేసి… అధ్యక్షుడిగా ట్రంప్ జరిపిన కీలకా సమావేశం ఇదే..!!

Vissu

కరోనా పై అవగాహన కార్యక్రమం చేసిన హైదరాబాద్ పోలీస్

Siva Prasad

TRS Party: కేసీఆర్ కి మరో పెద్ద చిక్కు.. మాజీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన మహిళ..!!

Yandamuri