NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నిక‌… ఇప్ప‌ట్లో లేన‌ట్లే

Huzurabad By Election: High Rate of Votes

Huzurabad: హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మరింత హీటెక్కించేందుకు ముఖ్య నేత‌లు టూర్లు వేస్తున్నారు. అయితే, ఈ ఉప ఎన్నిక‌కు మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కార‌ణం తాజాగా ఈసీ రాసిన లేఖ‌.

Read More: KCR: కేసీఆర్‌ కు మ‌ద్ద‌తిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడ‌మే మిగిలింది

త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌…
త్వ‌ర‌లోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ భావించాయి. అయితే, సీఈసీ కీల‌క మెలిక పెట్టింది. తెలంగాణలో హుజురాబాద్‌తో ఉప ఎన్నిక‌తో పాటు పొరుగు రాష్ట్రమైన ఏపీలో బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్,పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సైతం నిర్వ‌హించాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం దేశంలో మ‌ళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎలక్షన్ కమిషనర్లు సమావేశమై సమీక్ష నిర్వహించారు. తాజాగా రాజ‌కీయ‌ పార్టీల అభిప్రాయాలను సేకరించ‌డం మొద‌లుపెట్టారు.

Read More: KCR: కేసీఆర్ మ‌నిషిని బుక్ చేస్తున్న బీజేపీ

Huzurabad By Election: High Rate of Votes
ఇది ప‌రిస్థితి

కరోనా నేప‌థ్యంలో ఎన్నిక నిర్వహించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? నిర్వహిస్తే ఎలాంటి నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది? అనే వివ‌రాలు చెప్పాలంటూ రాజకీయ పార్టీలను సూచనలు, సలహాలు కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఇందుకు ఈ నెల 30వ వరకు గడవు విధించింది. దీంతో హుజురాబాద్ ఉప‌ ఎన్నిక షెడ్యూల్ ఇప్పట్లో వెలువడే అవకాశం కనిపించడం లేదన్న టాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణ తాజా లేఖ‌తో ప్రశ్నార్థకంగా మారింది.

author avatar
sridhar

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju