తెలంగాణ‌ న్యూస్

Huzurabad Congress: హుజూరాబాద్ కాంగ్రెస్‌లో కుదుపు..! ఆడియో టేప్ వైరల్..! కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు..!!

Share

Huzurabad Congress: మాజీ మంత్రి, బీజేపి నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక్కడ బీజేపీ నుండి ఈటల రాజేందర్ పోటీ దాదాపు ఖరారు కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో ఇంకా తేలలేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 60 వేలకుపైగా ఓట్లు సాధించిన కౌశిక్ రెడ్డి కొద్ది రోజులుగా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి తోడు తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో టేప్ లీక్ కావడం తీవ్ర సంచలనం రేపింది.

మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే కార్యకర్తతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..హుజూర్‌నగర్ టీఆర్ఎస్ టికెట్ తనకే ఖరారైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని, ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.4 నుండి 5వేలు ఇస్తాననీ అతనికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్ కు కౌశిక్ రెడ్డి సూచించారు. అయితే ఈ ఆడియో టేపు పై కౌశిక్ రెడ్డి స్పందించకపోవడంతో ఆయన టీఆర్ఎస్ వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఓ ప్రైవేటు కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ను కౌశిక్ రెడ్డి కలిశారు. ఈ తరుణంలోనే కౌశిక్ రెడ్డి ఆడియో సంభాషణ బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాలపై టీ పీసీసీ క్రమశిక్షణా సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు అందాయనీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కారణంగా కౌశిక్ రెడ్డిని పిలిచి హెచ్చరించినా అతనిలో మార్పు రాలేదనీ, దీంతో షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నట్లు కోదండరెడ్డి చెప్పారు. లేని పక్షంలో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


Share

Related posts

Architecture: ఇల్లు కట్టుకోవడానికి వాస్తు ప్రకారం  అనువైన భూమి అవునో కాదో తెలుసుకునేందుకు ఇలా చేసి చూడండి!!

siddhu

Bjp-Janasena : మళ్లీ బీజేపీ-జనసేన కాంబో! ఏ ఎన్నికల్లో అంటే?

Yandamuri

అనుష్క నిశ్శబ్ధం ఫ్లాప్ ఎఫెక్ట్ తో ఆ సినిమా రిలీజ్ విషయంలో టెన్షన్ పడుతున్న మేకర్స్ ..?

GRK