NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Hyderabad Gang Rape Case Details and Timeline In 10 Points: దర్యాప్తులో రాజకీయ ఒత్తిళ్లు లేవు(ట)..ఆలస్యానికి కారణం ఇదే..కేసు పూర్వపరాలు వివరించిన సీపీ ఆనంద్

Hyderabad Gang Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో మొదట నిందితులు అయిదుగురే (ఇద్దరు మేజర్ లు, ముగ్గురు మైనర్ లు) అని చెప్పిన పోలీసు అధికారులు  దర్యాప్తు అనంతరం ఒక మేజర్, అయిదుగురు మైనర్లుగా తేల్చారు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవనీ, బలమైన ఆధారాలు సేకరణ వల్లే కొంత ఆలస్యం జరిగిందనీ, కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

Commissioner of Police CV Anand press meet on Hyderabad Gang Rape Case

ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, నిందితులకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అనే వివరాలను సీపీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.  ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు సీపీ ఆనంద్. ఈ కేసులో గ్యాంగ్ రేప్ సెక్షన్ లు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులకు మూడు రకాల శిక్షలు పడే అవకాశం ఉందని సీపీ ఆనంద్ చెప్పారు.

CV Anand press meet on Hyderabad gang rape case, gives details of the accused minors age and other proceeding of the case so far.

20 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష , లేదంటే ఉరి శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అత్యాచారానికి పాల్పడని నిందితుడికి కనిష్ఠంగా అయిదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. కేసులో నిందితులపై నేరం నిరూపణ అయ్యేలా దర్యాప్తు పకడ్బందీగా చేసినట్లు వెల్లడించారు సీపీ ఆనంద్.

Hyderabad gang rape accused might get 20 years or life imprisonment. They are also potentially facing death by hanging/ capital punishment- Commissioner of police explains.

Hyderabad Gang Rape Case
CP CV Anand press meet with updates on Hyderabad teen gang rape incident at Jubilee Hills

 

What we know so far in Hyderabad Teen Gang Rape Case in Ten Points?

  1. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మైనర్ బాలుడు హైదరాబాద్ లో తన మిత్రులకు ఓ పార్టీ ఇవ్వాలని భావించాడు. హైదరాబాద్ లోని తన మిత్రులతో సంప్రదించి అమ్నీషియా పబ్ లో పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
  2. ఇందుకు గానూ ఒక్కొక్కరికి రూ.1200 లు చెల్లించాలని పబ్ నిర్వహకులు తెలుపగా బేరమాడి ఒక్కొక్కరికి రూ.900లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే సమాచారాన్ని తమ మిత్రులకు సర్క్యులేట్ చేసుకుని ఒక్కొక్కరి వద్ద రూ.1200లు వసూలు చేశారు. బాధితురాలు కూడా రూ.1300లు చెల్లించి పార్టీకి హజరైంది.
  3. మే 28న మధ్యాహ్నం పబ్ లో పార్టీ మొదలైంది. మధ్యాహ్నం 1.30 వరకూ డ్యాన్స్ పార్టీ జరిగింది. బాధితురాలిని పబ్ లో మరో స్నేహితురాలు కలిసింది. బాలికతో వచ్చిన స్నేహితుడు పని మీద బయటకు వెళ్లాడు. అప్పటి వరకూ స్నేహితులతో ఉన్న బాధిత బాలికను 3.15 గంటలకు నిందితుల్లో ఒకడైన బాలుడు కలిశాడు. కాసేపటికి సాదుద్దీన్ కూడా కలిసి బాలికను వేధించారు.
  4. 5.10 గంటల తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో ఇద్దరు బాలికలు ఇబ్బందిపడ్డారు. 5.15 గంటలకు పబ్ నుండి బయటకు వచ్చారు.

    CCTV Footage showing the Hyderabad gang rape victim leaving a pub in Jubilee Hills with her alleged attackers

  5. అప్పటికే పథకం వేసుకున్న నిందితులు వాళ్లను అనుసరించారు. బాలికతో పాటు ఉన్న యువతి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోగా, బాధిత బాలికకు నిందితులు మాయమాటలు చెప్పి ట్రాప్ చేశారు. కానసూ బేకరీకి వెళ్లడం కోసమని 5.43 గంటలకు బాలికతో పాటు నలుగురు నిందితులు బెంజ్ కారులో ఎక్కారు.
  6. అదే సమయంలో సాదుద్దీన్ సహా మరో నలుగురు ఇన్నోవా కారులో ఎక్కి బెంజ్ కారును అనుసరించారు. బంజారాహిల్స్ లో ఉన్న బేకరీకి వెళ్లే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయికి ముద్దులు పెట్టారు. దీన్నంతా తమ సెల్ ఫోన్ లో వీడియో తీసి వాట్సాప్ లలో షేర్ చేసుకున్నారు.
  7. రెండు కార్లు సాయంత్రం 5.51 గంటలకు కాన్సూ బెకరీ వద్దకు చేరుకున్నాయి. బేకరీ నుండి బయటకు వచ్చిన తరువాత ఆరుగురు నిందితులు బాధితురాలిని ఇన్నోవా లో ఎక్కించుకుని వెళుతుండగా మైనర్లలో ఒకరు ఫోన్ రావడంతో ఇన్నోవా దిగి వెనక్కు వెళ్లిపోయాడు.
  8. ఆ తరువాత సాదుద్దీన్ సహా మరో నలుగురు మైనర్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వెనుక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి ఒకరితరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ సందర్భంలో వీడియోలు తీసుకుని ఒకరితో మరొకరు షేర్ చేసుకున్నారు.
  9. అత్యాచారం తర్వాత బాధితురాలిని అమ్నేషియా పబ్ వద్దే వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాధితారులు తన తండ్రికి ఫోన్ చేయగా వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు.  అయితే తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆమె మెడపై అయిన గాయం చూసిన తల్లిదండ్రులు మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్ రేపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
  10. కేసు దర్యాప్తు లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు మొత్తం అయిదుగురే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే దర్యాప్తులో ఇద్దరు మేజర్ లలో ఒక నిందతుడు కూడా మైనరేనని తేలింది. బాధితురాలిని అత్యాచారం చేసింది అయిదుగురే అయినా కారులో ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేసిన మరో మైనర్ ను కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అయిదుగురు నిందితులు మైనర్లే కావడంతో వారు ఎవరన్న విషయాలను చెప్పకూడదని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

5 of the accused in Hyderabad Gang Rape case are minors and their details will not be shared because of this reason- CP CV Anand

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju