23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్టు …కీలక సమాచారం వెలుగులోకి.. తెలంగాణలో కస్టమర్లు వీళ్లే

Share

గోవా నుండి దేశంలోని పలు ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) సరఫరా చేసే కీలకమైన నిందితుడు ఎడ్విన్ ను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 17న నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు .. అతను చెప్పిన సమాచారం ఆధారంగా గోవాకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఆరుగురు పలువురు ఏజంట్ల ద్వారా డార్క్ వెబ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటికే జాన్సన్, డిసౌజా, నరేంద్ర ఆర్యలను అరెస్టు చేశారు. వీళ్లు సముద్ర మార్గంలో దక్షిణాఫ్రికా, నైజీరియా, నుండి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి హైదరాబాద్, గోవా, బెంగళూరు, ముంబాయి, ఢిల్లీలో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.

Drugs

 

గోవాలో 15 రోజుల పాటు బస చేసిన నార్కోటిక్ విభాగం పోలీసులు పక్కా సమాచారం ప్రకారం ఎడ్విన్ తలదాచుకున్న ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో మత్తు చాకెట్ల తయారు చేసి విక్రయిస్తున్న హైదరాాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీ అధినేత కుమారుడి గుట్టును కూడా పోలీసులు వెలుగులోకి తెచ్చారు. చాక్లెట్ లలో గంజాయి ఆయిల్ ను కలిపి విక్రయిస్తున్నాడని, ఇతని వినియోగదారుల్లో బాలికలే శాతం మంది ఉండటం పోలీసులను విస్మయానికి గురి చేసింది. డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కని పెట్టాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. మరో పక్క డ్రగ్స్ వ్యాపారంలో కీలక సూత్రధారి ఎడ్విన్ కాంటాక్ట్ లిస్ట్ లో దేశ వ్యాప్తంగా 50వేల మంది రీసివర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క తెలంగాణ నుండే 1200 మంది కస్టమర్లు ఉండటం విశేషం.

Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ పై ఈసికి కీలక డిమాండ్ చేసిన మాజీ ఐఏఎస్ అకునూరి మురళి


Share

Related posts

హెచ్1బి వీసాల్లో మార్పులు చేస్తాం:ట్రంప్

somaraju sharma

Visakha : పరిపాలనా రాజధానిలో ఓ కీలక భవన నిర్మాణానికి రూ.14 కోట్లు బదలాయింపు

Srinivas Manem

‘బాబు’పై వైసీపీ నేతల విమర్శనాస్త్రాలు

somaraju sharma