జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పక్కా సాక్షాధారాలతో చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపిన హైదరాబాద్ జూబ్లిహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పక్కా సాక్షాధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు, జస్టిస్ జూవైనల్ బోర్డులో జూబ్లిహిల్స్ పోలీసులు వేరువేరుగా నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఏకంగా 65 మందిని సాక్షులుగా చేర్చారు.  మైనర్ బాలురు తీవ్రమైన నేరం చేసినందున వారిని మేజర్లుగా పరిగణించి తగిన శిక్ష వేయాలని పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నారు. నిందితులపై నేరం నిరూపణ అయ్యే విధంగా సాంకేతిక అధారాలను పకడ్బందీగా సిద్దం చేశారు.

 

ఘటనా స్థలంలో లభించిన నమూనాలు వివరాలు, ఫారెన్సిక్ అధికారుల ఇచ్చిన నివేదిక, సీసీ టీవీ పుటేజీకి సంబంధించిన వివరాలతో పాటు నేరం నిరూపణకు అవసరమైన కీలక సాక్షాధారాలను చార్జిషీటులో పొందుపరిచారు జూబ్లిహిల్స్ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే అయిదుగురు మైనర్లు బెయిల్ పై విడుదల అవ్వగా, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాత్రం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతను బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.

కేసు విషయానికి వస్తే మే 28న మైనర్ బాలికపై సామూహిక  అత్యాచారం జరగ్గా..31వ తేదీన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన పోలీసులు .. విడతల వారీగా ప్రధాన నిందితుడు సాదుద్దీన్ తో పాటు మరో అయిదుగురు మైనర్లను జూన్ 5న అరెస్టు చేసి చేశారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్  చంచల్ గుడ జైలుకు తరలించగా, మైనర్ నిందితులను జూవైనల్ హోమ్ కు తరలించారు. నిందితులు రాజకీయ పార్టీ నేతల కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకుని నిందితులు నేరం చేసినట్లుగా రుజువు చేసే అన్ని సాక్షాధారాలను సేకరించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో ఫొరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

17 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

42 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago