IT Raids: తెలంగాణలో మరో సారి ఐటీ దాడులు కలకలం రేపాయి. గత కొన్నాళ్లుగా ఆదాయపన్ను శాఖ అధికారులు వివిధ వ్యాపార సంస్థల ప్రముఖులు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్, ఫార్మా, తదితర రంగాలకు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసంలో బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఎమ్మెల్యే నివాసం, కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. దాదాపు 70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పైళ్ల శేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ఐటీ సోదాలు జరుపుతున్నారు. 15 కంపెనీల్లో ఎమ్మెల్యే పెట్టుబడులు ఉన్నాయని ఐటీ అనుమానిస్తున్నది. హైదరాబాద్, భువనగిరి లోని ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఎమ్మెల్యే వ్యక్తిగత నివాసాల్లోనూ సోదాలు జరుపుతున్నారు అధికారులు. మెయిన్ ల్యాండ్, డిజిటల్ టెక్నాలజీస్, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ సహా మరికొన్ని కంపెనీల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడుగానూ ఉన్నారు. తెలంగాణ టాప్ టెన్ పొలిటీషియన్ లలో శేఖర్ రెడ్డి ఒకరు. ఆయనకు దాదాపు రూ.90 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి.
Eluru: ఏలూరులో దారుణం .. వివాహితపై యాసిడ్ దాడి