25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాల కలకలం.. టార్గెట్ ఈ సంస్థలే..?

Share

IT Raids: కేంద్ర దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు రాజకీయ నేతలు, మరో వైపు వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించడం కలకలాన్ని రేపుతున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో దాదాపు 50 కి పైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ప్రముఖ వ్యాపార వేత్తల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

income_tax_dept

హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెం 45 లోని ప్రముఖ వ్యాపార వేత్త కార్యాలయంలో ఈ రోజు (బుధవారం) ఉదయం నుండి ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. రియల్ ఎస్టేట్, సినిమా పెట్టుబడి దారులపై ఈ దాడులు జరుగుతున్నట్లు సమాాచారం. బిల్డర్ మాధవరెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ బిల్డర్ కు మాధవరెడ్డి బినామీగా ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. అదే విధంగా ఊర్జిత ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు మరో నాలుగు బిల్డర్ కంపెనీలపైనా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

రియల్ ఎస్టేట్, బిల్డర్స్, సినీ ఫైనాన్స్ వ్యాపారాల్లో ఎక్కువగా బ్లాక్ మనీ లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి అనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఐటీ అధికారులు ఈ రంగాలకు సంబంధించిన వ్యాపారులపైనే దృష్టి పెట్టినట్లుగా కనబడుతోంది. ఈ రోజు సాయంత్రానికి దాడులకు సంబందించి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది.


Share

Related posts

తలనొప్పి తరచు వేస్తుంటే ఏం చేయాలి..!?

bharani jella

పేదీంటోడి పల్సర్.. భలే రికార్డు సృష్టించింది..

bharani jella

Prabash: అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ పడి చచ్చేది ఏం చేసాడో తెలుసా…?

Ram