NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునే పార్టీ ఏది..? ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఫలితాలతో ఆ పార్టీలో అలజడి

Share

Telangana Assembly Polls: ఈ సారి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రాష్ట్రంలో జరిగే త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారే తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, సర్వేలు మాత్రం ఊహించని ఫలితాలు ఇస్తున్నాయి. ఎన్నికల షెడ్యుల్ ప్రకారం తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ .. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం కేసిఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రి కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో పలు ప్రముఖ సంస్థలు విడుదల చేస్తున్న ఎన్నికల సర్వేలు పార్టీ అధినేతలను ఆందోళన కల్గిస్తున్నాయి. ఇప్పటి వరకూ విడుదల అయిన దాదాపు అన్ని సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని తేల్చేశాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ.. ఇండియా టుడే – సీఓటర్ తమ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలోనూ కాంగ్రెస్ దే హవా అని తేల్చేసింది. ప్రస్తుతం ఈ సర్వే తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. తాజా సర్వేను చూస్తే అధికార బీఆర్ఎస్ కు ఇది షాకింగ్ వార్తే. అయితే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితి నుండి ఏ మాత్రం పుంజుకున్న ప్రభావం ఉండదని సర్వే చెప్పేసింది.

అయితే ఈ సర్వే ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు రావాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 54 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించనున్నట్లు సర్వే తెలిపింది. ఇక 2018 ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచిన బీ ఆర్ఎస్ ఈ సారి 49 స్థానాలు గెల్చుకోవచ్చని చెప్పింది. ఇక ఇతరులు గత ఎన్నికల్లో 11 మంది గెలిస్తే ఈ సారి 8 మంది గెలుస్తారని ఇండియా టుడే సీ ఓటర్ అంచనా వేసింది. అందరూ ఊహించినట్లుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28 శాతం ఓటింగ్ రాగా, ఈ సారి 11 శాతం పెరిగి 39 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

ఇక గత ఎన్నికల్లో 47 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ 9 శాతం కోల్పోయి 38 శాతానికి పడిపోనుంది. బీజేపీ ఓటు శాతం ఈ సారి భారీగా పెరిగినట్లు తెలిపింది. అయితే స్పష్టమైన మెజార్టీ ఏ రాజకీయ పార్టీకి వచ్చే అవకాశం లేదని చెప్పింది. కాంగ్రెస్ ఒక్కటే మ్యాజిక్ ఫిగర్ కు సమీపంలో నిలుస్తొంది. ఈ సర్వేతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ సంస్థ సర్వేనే ఈ విధంగా రిలీజ్ చేయడంతో బీఆర్ఎస్ పెద్దలు ఆందోళనలో పడ్డారని అంటున్నారు. ఈ రోజు సాయంత్రం, లేదా రేపు ఉదయం పార్టీ ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ సమావేశం అవుతారని తెలిసింది.

CM YS Jagan: పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సభలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు


Share

Related posts

Couple: భర్తలు ఇలా చేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది!!! (పార్ట్1)

Kumar

Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి బిగ్ రిలీఫ్ …మోడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు..

somaraju sharma

ప‌నికిరాని ప‌ర్సే క‌దా అని ప‌డేసింది.. దాంట్లో రూ.ల‌క్ష‌లు విలువ చేసే ఆభ‌ర‌ణాలు ఉన్నాయి..

Srikanth A