అమెరికా అధ్యక్షు జో బైడెన్ కు ప్రాణహాని కల్గించేందుకు యత్నించాడంటూ భారత సంతతికి చెందిన యువకుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో తెలుగు యువకుడు కందుల సాయి వర్షిత్ (19) వైట్ హౌస్ ఉత్తర భాగంలో ఓ భారీ ట్రక్ తో భీభత్సం సృష్టించాడు. వైట్ హౌస్ సమీపంలో లాఫెట్ స్క్వేర్ వద్ద భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి వర్షిత్ నడిపిన ట్రక్కుకు నాజీ జెండా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర పన్నినట్లు అతనిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సాయి వర్షిత్ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఆరు నెలలుగా ఈ దాడికి ప్లాన్ చేసినట్లు చెప్పాడని తెలుస్తొంది. కాగా.. చైస్ట్ ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సాయి వర్షిత్ 2022 లో మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుండి పాఠశాల విద్య పూర్తి చేశాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాల కలకలం