తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

IPS Paveen Kumar: రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో ఎంట్రీ ఖాయమే..కానీ

Share

IPS Paveen Kumar: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశంపై ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలను నమ్మవద్దని తేల్చి చెప్పారు  ప్రవీణ్ కుమార్. పోలీస్ అధికారిగా ఏ హోదాలో పని చేసినా ఆపదవికి వన్నె తెచ్చేలా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు. పూర్తిగా ప్రజా సేవకు అంకితం అయ్యేందుకే స్వచ్చంద పదవీ విరమణ చేసినట్లు ఆయన తెలియజేశారు.

IPS Praveen Kumar clarifies on political entry
IPS Praveen Kumar clarifies on political entry

Read More: Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గేది లే..! మరో సారి స్పష్టం చేసిన కేంద్రం..!!

ఐపీఎస్ సర్వీసు ఇంకా అరేళ్లు ఉండగానే ఆయన స్వచ్చంద పదవీ విరమణకు సిద్ధపడి ప్రభుత్వానికి లేఖ రాసిన 24 గంటల్లోనే కేసిఆర్ సర్కార్ ఆమోదించి ఆయన స్థానంలో వేరే అధికారిని నియమించి ప్రవీణ్ కుమార్ ను రిలీవ్ చేయడం విశేషం. ప్రభుత్వ సహకారం లేకుండా ఓ సీనియర్ ఐపీఎస్ రాజీనామాను ఆమోదించే పరిస్థితి ఉండదు. స్వేరోస్ లక్ష్యంతోనే ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. తన జీవితం మొత్తం మహనీయులు జ్యోతిరావుపూలే, అంబేద్కర్, కాన్షీరాం బాటలో, వారి ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతానని తెలిపారు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై త్వరలో ప్రకటిస్తాని చెప్పారు.

రాజకీయ రంగ ప్రవేశం చేయడం అయితే ఖాయమేనన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఎప్పుడు అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. హూజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మాత్రం చెప్పేశారు. తన పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు మంగళవారం ప్రవీణ్ కుమార్ అదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంలో రాజకీయ రంగ ప్రవేశంపై తన మనసులోని మాట చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై తానింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్న ఆయన రాజకీయాల్లోకి రావడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాలతోనే వ్యవస్థ మొత్తం మారుతుందనుకోవడం కూడా సరికాదని అభిప్రాయపడ్డారు. తన భవిష్యత్తు కార్యాచరణ రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

 


Share

Related posts

Today Horoscope అక్టోబర్ 1st గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

Somu Veerraju : నోటా పార్టీ అంటూ నోరు పారేసుకోకండి!మంత్రి వెల్లంపల్లి ని టార్గెట్ చేసిన సోము!!

Yandamuri

కరెంటు బిల్లు ఎంత వచ్చిందా అని చూసుకున్న ఆ హీరోయిన్ కు షాక్ కొట్టింది !

Yandamuri