IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు… హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ .. ఇవీ డిటైల్స్..

Share

IPS Transfers: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. దాదాపు 30 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ పోస్టింగ్ లు ఇచ్చింది. హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్ ఏసీబీ డీజీగా బదిలీ చేసిన సర్కార్ ఆయన స్థానంలో సీవీ ఆనంద్ కు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో ఐపీఎస్ ల బదిలీలతో గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మూడు సంవత్సరాల క్రితం భారీ సంఖ్యలో పోలీసు అధికారుల బదిలీ జరిగాయి. ఆ తరువాత ఇంత వరకూ ఆ స్థాయిలో బదిలీలు చేపట్టలేదు. 2018 ఏప్రిల్ నెలలో కేంద్ర సర్వీసులకు వెళ్లి మూడు నెలల క్రితం రాష్ట్ర కేడర్ కు వచ్చిన సీవీ ఆనంద్ కు ఊహించినట్లుగానే కీలక బాధ్యతలు అప్పగించింది కేసిఆర్ సర్కార్.

IPS Transfers in telangana
IPS Transfers in telangana

IPS Transfers: ఐపీఎస్ బదిలీలు ఇలా..

 • ఏసీబీ డీజిగా అంజనీకుమార్
 • హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
 • ఏసీబీ డైరెక్టర్ గా షికా గోయల్
 • హైదరాబాద్ జాయింట్ సీపీగా ఏఆర్ శ్రీనివాస్
 • హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్
 • నల్లగొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి
 • సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేత
 • హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపిగా జోయల్ డేవిస్
 • హైదరాబాద్ జాయింట్ కమిషనర్ గా కార్తికేయ
 • మెదక్ ఎస్పీగా రోహణి ప్రియదర్శిని
 • సైబరాబాద్ క్రైమ్ డీసీపీగా కమలేశ్వర్
 • సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గా అవినాష్ మహంతి
 • హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి
 • హైదరాబాద్ డీసీపీగా గజరావు భూపాల్
 • హైదరాబాద్ ఎస్బీ జాయింట్ కమిషనర్ గా పి విశ్వప్రసాద్
 • మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్
 • హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఎన్ ప్రకాశ్ రెడ్డి
 • వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి
 • నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా కేఆర్ నాగరాజు
 • ఆదిలాబాద్ ఎస్పీగా డి ఉదయ్ కుమార్
 • నిర్మల్ ఎస్పీగా సిహెచ్ ప్రవీణ్ కుమార్
 • నాగర్ కర్నూల్ ఎస్పీగా కే మనోహర్
 • మాదాపూర్ డీసీపీగా కే శిల్పవల్లి
 • నారాయణపేట ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లు
 • జనగామ డీసీపీగా పి సీతారామ్
 • శంషాబాద్ డీసీపీగా ఆర్ జగదీశ్వర్ రెడ్డి
 • జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా జే సురేందర్ రెడ్డి
 • కామారెడ్డి ఎస్పీగా బి శ్రీనివాసరెడ్డి
 • బాలానగర్ డీసీపీగా సుదీప్ గోనె


Share

Related posts

దీదీ సామ్రాజ్యంలో బీజెపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి..

somaraju sharma

Viral: ఇలాంటి శిక్ష ఎవరికీ పడకూడదు.. మరీ 8,000 సంవత్సరాలా?

Ram

ఆ వెబ్ సిరీస్ కి దర్శకుడిగా తేజ పేరు వేసుకోవడం లేదా ..?

GRK