IT Raids: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ మరో సారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నిన్న మున్నటి వరకూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ధులు, వారి సంబందీకుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు జరపడంతో బీఆర్ఎస్, బీజేపీ ఈ సోదాల వెనుక ఉందని వారు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా అధికార బీఆర్ఎస్ అభ్యర్ధి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరగడం గమనార్హం.
ఓ పక్క ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా ఉన్న తరణంలో ఐటీ సోదాలు చేస్తుండటంతో ఎప్పుడు ఎవరి ఇంటికి దాడులకు వస్తారో ఆందోళన అభ్యర్ధులు, వారి అనుయాయుల్లో నెలకొంది. తాజాగా గురువారం వేకువజాము నుండి 40 బృందాలతో హైదరాబాద్ తో పాటు నల్లొండ, మిర్యాలగూడ లో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో వేకువజాము నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
మిర్యాలగూడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన నల్లమోతు భాస్కరరావుకు దేశ వ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. పలు పవర్ ప్లాంట్ లో బాస్కరరావుకు పెట్టుబడులు ఉన్నాయి. భాస్కరరావు, ఆయన బావ మరిది శ్రీధర్ తో పాటు మరో నాలుగు చోట్ల మిర్యాలగూడలో సోదాలు జరుగుతున్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
Vijayasanti: బీజేపీకి బైబై చెప్పిన విజయశాంతి