IT Rides: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలపై వరుసగా మూడవ రోజు కూడా ఆదాయపన్ను (ఐటీ) దాడులు కొనసాగిస్తున్నది. కోహినూర్ తో పాటు మరో ఆరు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయిదు సంవత్సరాలుగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు అందిన సమాచారంతో ఆదాయపన్ను శాఖ అధికారులు మూడు రోజుల క్రితం తనిఖీలు చేపట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుండే వేర్వేలు బృందాలుగా ఐటీ అధికారులు విడిపోయి మొత్తం నలభై ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు.

సోదాల్లో భాగంగా భారీ మొత్తంలో నగదు, కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. దాంతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల యాజమాన్యాలు బినామీ కంపెనీల పేర పెద్ద ఎత్తున భూ క్రయ విక్రయాలు జరిపినట్లుగా గుర్తించినట్లు తెలుస్తొంది. వీటికి సంబందించి తనిఖీలు పూర్తి అయిన తర్వాత అధికారికంగా సమాచారాన్ని అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.