NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

IT Rides: హైదరాబాద్ లో మరో సారి ఐటీ సోదాల కలకలం .. కాంగ్రెస్ నేతల్లో గుబులు

IT Rides: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐ వస్తాయని ఇంతకు ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవిత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరో నాలుగు వారాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో సోదాలు జరగడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన నివాసంతో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితమే తుక్కుగూడలో కేఎల్ఆర్.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మరో పక్క శంషాబాద్ మండలం బహదూర్ గూడ అక్బర్ బాగ్ లో కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిసరాల్లోని పలు ఫామ్ హౌస్ లు, గచ్చిబౌలి సమీపంలోని ఎన్సిసీలో కూడా కేఎల్ఆర్ కు విల్లా ఉన్నట్లు సమాచారం. మరో పక్క కాంగ్రెస్ నేత పారిజాత నర్శింహరెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బడంగ్ షేట్ కార్పోరేటర్ గా ఉన్న పారిజాత .. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించారు.

income tax dept

ప్రస్తుతం పారిజాత నర్శింహారెడ్డి ఢిల్లీలో, పారిజాత తిరుపతిలో ఉండగా, ఐటీ అధికారులు పారిజాత కుమార్తె ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎన్నికల ప్రచార హడావుడిలో పార్టీ నేతలు ఉన్న సమయంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతుండటంతో పలువురు కాంగ్రెస్ నేతల్లో గుబులు రేగుతోంది. ఎన్నికల సమయంలో ఇటువంటి తనిఖీలు జరుగుతాయని ముందే ఊహించిన పలువురు నేతలు ఇప్పటికే అప్రమత్తమయ్యారని సమాచారం.

Telangana Assembly Election: బీజేపీకి బిగ్ ఝలక్ .. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా, కాంగ్రెస్ లో చేరిక

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!