NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Jagga Reddy: రేవంత్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్..!!

Jagga Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో జగ్గారెడ్డి పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీనా …ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయం కనీసం గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా, సంగారెడ్డి జిల్లాకు వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నతనకే సమాచారం ఇవ్వారా అని నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించాలి కదా సమాచారం ఇవ్వకపోవడం అంటే రేవంత్ తో వివాదం ఉందని చెప్పాలని అనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

Jagga Reddy serious comments on revanth reddy
Jagga Reddy serious comments on revanth reddy

అనంతరం మీడియా పాయింట్ వద్ద కూడా తన ఆవేదనను వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.  కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరో హీరో కాలేరనీ, రేవంత్ పీసీసీ కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేనని గుర్తు చేశారు జగ్గారెడ్డి. రాజకీయాల్లో హీరోయిజం పని చేయదని వ్యాఖ్యానించారు. పార్టీ లో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి వత్తిడి మేరకు ఇలా ప్రవర్తించారో చెప్పాలని అన్నారు. పార్టీ మారాలంటే అడ్డు చెప్పేవారు ఎవరు తనకు లేరు కానీ నైతిక విలువలకు కట్టుబడి తాను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ల నాయకత్వంలో పని చేస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో వెళ్లి పని చేయాలన్నారు. రాష్ట్రంలో తనకు అభిమానులు ఉన్నారనీ, కావాలంటే పార్టీ సపోర్టు లేకుండా రెండు లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానంటూ సవాల్ చేశారు జగ్గారెడ్డి. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju