NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Janasena: తెలంగాణలో జనసేనకు ఘోర పరాభవం .. ‘కమ్మ’గా దెబ్బేశారు(గా)..!

Telangana Janasena: తెలంగాణలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఘోర పరాభవాన్ని చవి చూసింది. బీజేపీ పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ఏపీలో టీడీపీతో పొత్తులో ఉండటం వల్ల తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఉన్న సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరులు, కమ్మ సామాజికవర్గం జనసేన అభ్యర్ధులకు ఓట్లు వేస్తారని భావించారు. కానీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు.

కూకట్ పల్లి, తాండూరు, కొత్తగూడెం లో స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా ఆ పార్టీ అభ్యర్ధి కనీసం పోటీలో నిలవ లేకపోయారు. కూకట్ పల్లిలో కమ్మ సామాజికవర్గం, సెటిలర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా పని చేసినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు. జనసేన తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట, కూకట్ పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో పోటీ చేసింది.

కూకట్ పల్లి జనసేన అభ్యర్ధికి మాత్రం 5306 ఓట్లు రాగా, ఇతర నియోజకవర్గాల్లో 500 ఓట్లు లోపుగానే వచ్చాయి. అశ్వారావుపేటలో జనసేన అభ్యర్ధికి 616, వైరాలో 498, నాగర్ కర్నుల్ లో 310, కొత్తగూడెంలో 118, తాండూరులో 95, ఖమ్మంలో 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జనసేన పార్టీ అభ్యర్ధులు ఏ రాజకీయ పార్టీతో కాకుండా నోటాతో పోటీ పడిందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కూకట్ పల్లిలో దాదాపు 80వేల కమ్మ సామాజికవర్గం ఓట్లు ఉన్నా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి గెలవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గం అభ్యర్దులకే వారు ఓట్లు వేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కొట్టిన దెబ్బతో జనసేన ఘోరంగా చతికిలపడిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.

మరో పక్క బీజేపీ – జనసేన అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితర పార్టీ అగ్రనేతలు ప్రచారం చేసినా బీజేపీ ముఖ్య నేతలు ఓటమి పాలైయ్యారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్ కూడా ఓటమి బాట పట్టడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది.

BRS – Pocharam: పార్టీ పేరు మార్చినా సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయిన కేసిఆర్ .. ఆనవాయితీని బ్రేక్ చేసిన స్పీకర్ పోచారం  

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri