NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Journalist Raghu Case: జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ కేసు : ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్టర్ కే‌సి‌ఆర్ ??

Journalist Raghu Case: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు రఘును అరెస్టు చేసిన తీరును వివిధ రాజకీయ పక్షాలు తప్పుబట్టాయి. ఇంటి నుండి బైక్ పై బయటకు వెళ్లిన జర్నలిస్ట్ రఘు ఓ తోపుడు బండి వద్ద మామిడి కాయలు కొనుగోలు చేస్తుండగా మఫీలో వచ్చిన పోలీసులు మల్కాజిగిరిలో బలవంతంగా కారులో ఎక్కించుకుని తరలించారు. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ “ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? అని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు. దీన్ని కిడ్నాప్ అంటారా? లేక అరెస్టు అంటారా? వీళ్లు పోలీసులా? లేక గులాబీ గుండాలా? ఇదేం రాజ్యం? ఒక జర్నలిస్ట్ పై ఇంత దారుణం ఎందుకు? నోటీసు ఇచ్చి అరెస్టు చేయవచ్చు కదా? నిరంతరం ఫ్రెండ్లీ పోలీసు గూర్చి తపించే తెలంగాణ డీజీపీ గారు ఈ పోలీసులపై మీరు ఏం చర్యలు తీసుకుంటారు” అని ప్రశ్నించారు.

Journalist Raghu Case opposition leaders condemned
Journalist Raghu Case opposition leaders condemned

ప్రభుత్వ లోపాలను ఎండగడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుర్రంపోడు తండాలోని గిరిజన భూముల కబ్జా బాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు జర్నలిస్ట్ రఘుపై కేసు పెట్టారని తెలిసిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

Read More: Corona Vaccine: ప్రైవేటు హాస్పటల్స్ లో టీకా ధరలను నిర్ణయించిన కేంద్రం…! ఏ టీకా ధర ఎంత అంటే..?

జర్నలిస్ట్ వినోద్ దువా పై నమోదు అయిన దేశద్రోహం కేసును సుప్రీం కోర్టు కొట్టేసిన రోజునే ఇక్కడ తెలంగాణలో జర్నలిస్ట్ రఘును పోలీసులు అనైతికంగా అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఈ నెల 3వ తేదీన రఘును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రఘు సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు అరెస్టు చూపి హూజూర్‌నగర్ కోర్టులో జడ్జి ముందు హజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించడంతో హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించారు.

అసలు విషయం ఏమిటంటే .. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా 540 సర్వే నెంబర్ ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన  గిరిజన భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆనాడు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య రాళ్ల దాడి జరిగింది. పలువురు పోలీసులతో పాటు బీజేపీ నేతలు గాయపడ్డారు. నాటి ఘటనకు సంబంధించి బీజేపీ నేతలతో పాటు పలువురు స్థానికులపైనా కేసు నమోదు చేశారు. మొత్తం 21 మంది నిందితుల్లో ఏ 19 గా జర్నలిస్ట్ రఘు, ఏ 20గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజెపి ఏమ్మెల్యే రఘునందన్ రావు ఏ 21 గా ఉన్నారు. అయితే ఈ కేసులో 1 నుండి 6వరకూ ఉన్న నిందితులను అరెస్టు చేసి ఆ తరువాత బెయిల్ పై విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ రఘును పోలీసులు విచారణ కూడా పిలవలేదు.

నాడు కొందరిని మాత్రమే అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు నాలుగు నెలల తరువాత రఘును అరెస్టు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో రఘు బెయిల్ ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జనవరి నెలలో ఎమ్మెల్యే ను దూషించాడని వచ్చిన ఫిర్యాదుపై రఘుపై కేసు నమోదు చేసిన మఠంపల్లి పోలీసులు పీటీ వారెంట్ కూడా తెచ్చుకున్నారని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో సంచలనంగా మారిన జర్నలిస్ట్ రఘు అరెస్టు వ్యవహారం, కేసుల నమోదు తీవ్ర చర్చనీయంశమవుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!