NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడు ప్రజలకు హస్యాన్ని పండిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఆర్ఒకు నా శాపం తగిలిందంటూ వ్యాఖ్యలు

Munugode Bypoll:  కేఏ పాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలకు, వివిధ దేశాల్లోని ప్రముఖులతోనూ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఓ పదిహేనేళ్ల క్రితం వరకూ ఆయన కీర్తి బాగానే ఉండేది. అయితే ఆయన ప్రజా శాంతి పార్టీ స్థాపించిన నాటి నుండి ఆయన చేతలు, మాటలు హస్యాన్ని పండిస్తుండటంతో ఆయనలో మంచి కమేడియన్ ను ప్రజలు చూస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసిన కేఏ పాల్ కు నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తం గా అనేక నియోజకవర్గాల్లో ఆయన పార్టీ తరపున పోటీ చేసిన వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో నోటాకు 12వేలకుపైగా ఓట్లు రాగా కేఏ పాల్ కు మాత్రం కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆయన మాటలు కోటలు దాటుతుంటాయి.

KA Paul

 

ఇప్పుడు ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉండటంతో అక్కడి ప్రజలకు మంచి వినోదం లభిస్తొంది. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల సంఘం నుండి గుర్తింపు రద్దు కావడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉన్నారు. గతంలో ప్రజా శాంతి పార్టీకి హెలికాఫ్టర్ గుర్తు కేటాయించేది ఈసీ. అయితే ఆయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉండటంతో ఉంగరం గుర్తు కేటాయించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేఏ పాల్ .. తన మాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఏ మాత్రం కార్యకర్తలు లేని కేఏ పాల్ .. ప్రధాన రాజకీయ పక్షాలు తన ముందు దిగ దుడుపే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు కేఏ పాల్. ఉప ఎన్నికల్లో తనదే గెలుపు అంటూ ఘంటాభజాయించి చెబుతున్నారు. తమకు ఉన్న హెలికాఫ్టర్ గుర్తును ఎవరికో ఇచ్చారనీ, అందుకే రిటర్నింగ్ అఫీసర్ ను తాను శపించాననీ, దీంతో ఆయనపై వేటు వేశారని చెప్పుకొచ్చారు కేఏ పాల్. వాస్తవానికి రోడ్ రోలర్ గుర్తు మార్పు వివాదంలో ఆర్ఓ పై ఈసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Munugode bypoll

 

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చాయనీ, ఇతర సామాజిక వర్గాలను పట్టించుకోలేదని విమర్శించారు కేఏ పాల్. తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినప్పుడు కూడా ఆయన అనుచరులు జై కేఏ పాల్ అన్నారని చెప్పుకున్నారు. ఉంగరం గుర్తుకే మన ఓటు అంటూ మునుగోడు ప్రజలు నినదిస్తున్నారని అన్నారు. తాను గెలిచిన ఆరు నెలల్లో ఒక యూనివర్శిటీ, ఒక కాలేజీ, ఒక హాస్పటల్ కట్టిస్తానని, మండలానికి వెయ్యి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారు కేఏ పాల్. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని ఇప్పటికే తేలిపోయిందనీ, బీజేపీ, టీఆర్ఎస్ కు డిపాజిట్లు వస్తాయా లేదా అనే విషయం త్వరలోనే తేలుతుందని అన్నారు కేఏ పాల్. ఇలా తన నోటికి వచ్చినట్లుగా కేఏ పాల్ వాగ్దానాలు ఇస్తూ ప్రజలకు హస్యాన్ని పండిస్తున్నారు కేఏ పాల్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N