KCR: వ‌రాల వాన కురిపించిన కేసీఆర్‌… లెక్క తేడా రావొద్ద‌నేనా?

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు వ‌రాల వాన కురిపించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ప‌లు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాకుండా కొన్ని వ‌రాలు సైతం ప్ర‌క‌టించారు. వ్యవసాయంపై కేబినెట్‌లో జ‌రిగిన చర్చలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై కేబినెట్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంది. పత్తిసాగు పై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

Read More : KCR: కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన కాంగ్రెస్ పెద్దాయ‌న‌

ఉద్యోగాల కోసం చూసేవారికి…
కేంద్రం ప్రవేశపెట్టిన ఇడబ్లుఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్) రిజర్వేషన్ కోటాకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విద్యా, ఉద్యోగ అవకాశాలలో రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఇడబ్లుఎస్ కేటగిరి అభ్యర్థులు అర్హులుగా కేబినెట్ తీర్మానించింది. ఇడబ్లుఎస్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపునివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

Read More : KCR: గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కేసీఆర్‌కు ఇచ్చిన స‌ల‌హా ఏంటో తెలుసా?

ఆస్ప‌త్రుల‌కు శంకుస్థాప‌న‌లు…
కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాల సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతి పై చర్చ జరిగింది. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్, చెస్ట్ హాస్పటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బినగర్ గడ్డి అన్నారం, అల్వాల్ లో, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. పటాన్ చెరువులో కార్మికులు ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను కేబినెట్ మంజూరు చేసింది.

Read More : Eatela Rajendar: ఈట‌లకు భ‌లే తీపి క‌బురు చెప్పిన‌ కోమ‌టిరెడ్డి

57 ఏళ్ల వారికి పెన్ష‌న్లు…
పించ‌న్ అర్హ‌త వ‌య‌సును 57 ఏళ్ల‌కు త‌గ్గిస్తూ కేసీఆర్ సార‌థ్యంలోని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తక్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నిర్ణ‌యంతో 6,62,000 కొత్త పించ‌న్లు పెర‌గ‌నున్నాయి. మ‌రోవైపు దోబీ గాట్లు, సెలూన్ల‌కు 250 యూనిట్ల వ‌ర‌కు ఉచిత క‌రెంటు విష‌యంలో త‌క్ష‌ణ‌మే సంపూర్ణంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించింది.


Share

Related posts

Bigg Boss 5 Telugu: లోబో పై ప్రియాంక సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్..!!

sekhar

మేనల్లుడిని చెట్టుకు కట్టేసి… ఆంటీపై ఆరుగురి అఘాయిత్యం!

arun kanna

తిరిగి వైసిపిలో చేరిన ఎస్‌వి

sarath