దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షులు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్, భోపాల్ లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కేంద్రం నిర్ధారించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్… పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిపింది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలంది. పక్షులను పూర్తి స్థాయిలో పెంచడంతో పాటు నిఘా ఉంచాలని…ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్త చెందకుండా చూడాలని కోరింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం.
బర్డ్ ప్లూ వైరస్ నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి అధికారులతో మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని రాష్ట్రంలో బర్డ్ ప్లూ ఆనవాళ్లు లేవని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తీసుకున్న ముందస్థు జాగ్రత్తలతో రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదన్నారు. బర్డ్ ఫ్లూపై రాష్ట్రంలో 1300 అధికారుల టీమ్ లు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. కోళ్ళ పరిశ్రమలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ౩వ స్థానంలో ఉందని.. బర్డ్ ఫ్లూపై అన్ని స్థాయిల అధికారులను అప్రమత్తం చేశామన్నారు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…