KCR: టీఆర్ఎస్ లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేసిఆర్ కు వీళ్లంటే ప్రాణం..!!

Share

KCR: ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి సేవలు అందిస్తుంటే అటు ప్రజల్లోనూ, అటు పార్టీలోనూ మంచి పరపతి ఉంటుంది. అలా కష్టపడే నేతలను పార్టీ అధినేతలు ఇష్టపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ముగ్దుడవుతున్నారుట. టీఆర్ఎస్ కు చెందిన యువ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో దూసుకుపోతున్నారుట. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరో మారు నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ యువ ఎమ్మెల్యేలు పార్టీ పనులతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ నేతలు పట్నం నరేందర్ రెడ్డి (కొడంగల్), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూర్), డాక్టర్ ఆనంద్ (వికారాబాద్), కొప్పుల మహేష్ రెడ్డి (పగిరి) లు మొదటి సారి 2018 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. వీరు నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ వస్తున్నారు.

KCR: ప్రజల మధ్యే ఉంటూ

కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించి నరేందర్ రెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీ పట్టు సడలకుండా ఉండేందుకు కష్టపడుతున్నారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటి నుండి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారు. అదే విధంగా పగిరి నియోజకవర్గంలో కొప్పుల మహేశ్ రెడ్డి కూడా హంగు అర్బాటులు లేకుండా నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక వికరాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ప్రతి రోజు క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గ్రామాల్లో, పట్టణాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. ఈ యువ ఎమ్మెల్యేల పని తీరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ప్రశంసిస్తున్నారుట.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago