KCR: కేసీఆర్‌కు షాక్ ఇస్తున్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేత‌లు

Share

KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఓట‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్‌కు ఓ స‌మ‌స్య షాకిస్తోంద‌ని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా ప్రతీ ముఖ్య నాయకుడు హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న తపనతో వ్యూహాలు రచిస్తుంటే.. స‌రిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా కేసీఆర్ కు షాకిచ్చేలా ప‌రిణామాలు మారుతున్నాయంటున్నారు.

Read More : KCR: కేసీఆర్ విష‌యంలో ఈ కాంగ్రెస్ సీనియ‌ర్ లెక్కేంటో అర్థం కావ‌ట్లేద‌ట‌


కేసీఆర్ కు షాకిస్తున్న టీఆరెస్ నేతలు

హుజురాబాద్‌ లో కొంద‌రు టీఆర్ఎస్ నేత‌ల కొత్త ఎత్తుగ‌డ‌లు అవాక్క‌య్యేలా ఉన్నాయంటున్నారు. ఈటలను వీడి టీఆర్ఎస్‌లో చేరిన కొంతమంది ముఖ్య నాయకులు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. పైకి మాత్రం గులాబీ జెండా కప్పుకుంటున్నా లోలోన మాత్రం కమలం వైపు కొంద‌రు నాయ‌కులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులను నీడలా వెంటాడుతున్న ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఎలా అన్న అంతర్మథనం కొంతమంది నాయకుల్లో మొదలైంది. స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న ఈ కోవ‌ర్టు ఆప‌రేష‌న్‌ తీరుపై పార్టీలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి.

Read More : KCR: కేసీఆర్ ఆశ‌లన్నీ అడియాస‌లు చేసేసిన కేంద్రం

పార్టీ పెద్ద‌ల దృష్టికి…
ఈటల ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన కొంతమంది ముఖ్య నాయకులు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్న తీరు పార్టీ ముఖ్య నాయకుల వరకూ చేరినట్టుగా తెలుస్తోంది. ఉన్నట్టుండి హుజురాబాద్‌లో సీక్రెట్‌గా జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకున్న ముఖ్య నాయకులు కోవర్టులకు చెక్ ఎలా పెట్టాలని స్కెచ్‌లు వేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో విడుదల కానున్న నేపథ్యంలో పిడుగు లాంటి ఈ సమాచారం తెలియడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్న హుజురాబాద్‌లో ఈ స‌మ‌స్య‌ను టీఆర్ఎస్ పెద్ద‌లు ఎలా ప‌రిష్క‌రిస్తారో మ‌రి!


Share

Related posts

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత..!!

sekhar

కరోనా రెండో వేవ్ కి భారత్ సిద్దమేనా?

Special Bureau

Gopichand: గోపీచంద్ 12 సంవత్సరాల నుండి చేస్తున్న ఒక గొప్ప పని..!!

sekhar