KCR: కేసీఆర్ ను కొత్త‌గా ఇరికిస్తున్న ర‌ఘునంద‌న్ రావు

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం ఆ పార్టీకి ఎంత మేలు చేస్తుందో రాబోయే కాలంలో తేల‌నుండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కైతే ప్ర‌తిప‌క్షాలు గులాబీ ద‌ళ‌ప‌తిని టార్గెట్ చేసుకునేందుకు ఉప‌యోగించుకుంటున్నాయి. తాజాగా ద‌ళిత‌బంధు విష‌యంలో సంచ‌లన వ్యాఖ్యాలు దుబ్బాక లో కూడా దళిత బందు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Read More: KCR: ద‌ళిత‌బంధు కేసీఆర్ కు బెడిసికొడుతోందా?

ఉద్య‌మం చేస్తార‌ట‌…
దుబ్బాక వెనకబడిన ప్రాంతం.. కేసీఆర్ చదివి..పెరిగిన ప్రాంతం కాబట్టి దళిత బందు అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాకలో దళిత బందు అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామన్నారు. హుజూరాబాద్ లో ఈటెలను ఎదుర్కోలేక దళిత బందు పథకం పెట్టారని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టే.. దుబ్బాక లో కూడా అమలు చేయాలన్నారు. దళిత సామాజిక వర్గానికి కేసీఆర్.. కార్పొరేషన్ పదవులతోనే సరిపెడుతున్నారని….మంత్రి పదవులెందుకివ్వరని ప్రశ్నించారు. రాహుల్ బొజ్జ మీకు ఇంతకు ముందు గుర్తుకు రాలేదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. స్మిత సభర్వాల్ కు ముందే రాహుల్ బొజ్జ ఉమ్మడి మెదక్ జిల్లాకు కలెక్టర్ గా ఉన్నారన్నారు.

Read More: KCR: కేసీఆర్‌కు ఏకు మేకు అవుతున్న ద‌ళిత‌బంధు!

ఇప్ప‌టికే భారీ నిధులు…
ఇదిలాఉండ‌గా ద‌ళిత‌బంధు విష‌యంలో సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద దళితబంధు పథకం అమలుకు రూ.500 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించి హుజురాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ ఇటీవల వాసాలమర్రిలో దళిత బంధును కేసీఆర్ అమలు చేశారు.


Share

Related posts

రష్యా వ్యాక్సిన్‎కి 20 దేశాలు వంద కోట్ల ఆర్డర్లు..!!

sekhar

Relationship tips భార్యభర్త ల మధ్య బంధం ఎప్పుడు కొత్తగా ఉండాలంటే ఇవి పాటించి చూడండి…!! (పార్ట్-2)

Kumar

రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలి అంటున్న పవన్..!!

sekhar