KCR: కేసీఆర్ విష‌యంలో ఈ కాంగ్రెస్ సీనియ‌ర్ లెక్కేంటో అర్థం కావ‌ట్లేద‌ట‌

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యంలో ఓ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వైఖ‌రి ఏంటో అర్థం కావ‌డం లేదంటున్నారు. ఓ సారి ప్ర‌శంస‌లు మ‌రోసారి విమ‌ర్శ‌లు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌ద‌రు నేత తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఆయ‌నే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన జీవ‌న్ రెడ్డి తాజాగా ఆయ‌న‌పై మండిప‌డ్డారు. దీంతో ఈ సీనియ‌ర్ వైఖ‌రి గురించి కాంగ్రెస్ వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నాయి.

Read More: KCR: హుజురాబాద్‌కు షాకిచ్చి వాసాల‌మ‌ర్రిలో కేసీఆర్ ఆ మాట ఎందుకు చెప్పారంటే…

మొన్న అలా…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇటీవ‌ల జీవ‌న్ రెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. మాట ఇస్త‌నే త‌ప్ప‌ని వ్య‌క్తి అంటూ ప్ర‌శంసించారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని స్వాగ‌తించారు. ఇలా ప్ర‌శంసించిన జీవ‌న్ రెడ్డి తాజాగా కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దళితుల మనోభావలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే కేసీఆర్ కు దళితుల ఆత్మగౌరవం గుర్తుకు వస్తుంద‌ని ఫైర్ అయ్యారు. దళితున్ని సీఎం చేస్తా అన్న కేసీఆర్ మాట తప్పి- ఆయనే సీఎం కుర్చీపై కూర్చున్నార‌ని విరుచుకుప‌డ్డారు. మొదటి పర్యాయంలో దళితునికి డిప్యూటీ సీఎం ఇచ్చిన కేసీఆర్- రెండో ప్రభుత్వంలో అదికూడా ఇవ్వలేదని తెలిపారు.

Read More: KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక‌.. కేసీఆర్ కు ఓ గుడ్ న్యూస్… ఇంకో బ్యాడ్ న్యూస్…

కీల‌క డిమాండ్లు…
15శాతం రిజర్వేషన్లు క‌ల్పించ‌డంలో భాగంగా దళితుల‌కు ప‌రిపాలనలో భాగస్వామ్యం కల్పించాలని జీవ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. 15శాతం రిజర్వేషన్ ప్ర‌కారం ముగ్గురు మంత్రులను నియ‌మించాల్సిన కేసీఆర్ ఒక్కరికే అవకాశం కల్పించారని మండిప‌డ్డారు. దళితుల భావాలను కేసీఆర్ కించపర్చుతున్నారని త‌ప్పుప‌ట్టారు. కేసీఆర్ పాలనలో దళితుల పై ప్రేమ మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌ని పేర్కొన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ చేయకుండా దళితులకు అన్యాయం చేస్తూ- మోసం చేస్తూ దళిత బంధు అమలు చేస్తున్నారని జీవ‌న్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. కాగా హ‌ఠాత్తుగా జీవ‌న్ రెడ్డి ఈ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారేంట‌న్న చ‌ర్చ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది.


Share

Related posts

సాగు చట్టాలపై కేంద్రం కీలక ప్రతిపాదన..సమయం కోరిన రైతు సంఘాలు

somaraju sharma

నగరిలో రోజా పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉందా?కన్నీరు కార్చే వరకు వచ్చిందా?

Yandamuri

BREAKING: csajjanar అందరి ఫెవరెట్ పోలీస్ సజ్జనార్ ని ట్రాన్స్ఫర్ చేశారు – ఏ శాఖలో వేసారో తెలుసా

amrutha