తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్‌పై ష‌ర్మిల రాజ‌కీయం మామూలుగా లేదుగా….

Share

KCR: తెలంగాణ రాజ‌కీయాల్లో స‌త్తా చాటుకోవాల‌ని భావిస్తున్న వైఎస్ ష‌ర్మిల ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు త‌న టార్గెట్‌కు అనుకూలించే వ‌ర్గాల‌పై ష‌ర్మిల ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. వారే యువ‌త‌. యువ‌త‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతూ వైఎస్ ష‌ర్మిల త‌మ విమ‌ర్శ‌లు సందిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నేత‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చస్తేనే ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్ర‌శ్నించారు.

Read More: KCR: ఉప ఎన్నిక‌కు అప్పుడే ఎత్తుగ‌డ‌ వేసేసిన కేసీఆర్

ys sharmila criticizing cm kcr
ys sharmila criticizing cm kcr

ష‌ర్మిల పార్టీ నేత‌లు ఏమంటున్నారంటే..
ఎన్నికలప్పుడే నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని, తర్వాత వాటి ఊసెత్తరని వైఎస్సార్ టీపీ నేత ఇందిరా శోభన్ విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణాను కేసీఆర్ దగా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ త‌న కూతురుకు కవితకు ఆగమేఘాల మీద ఉద్యోగం కల్పించిన కేసీఆర్.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. చస్తేనే ఉద్యోగాలు ఇస్తారా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Read More: Revanth Reddy: ఇటు కేటీఆర్‌ను అటు కిష‌న్ రెడ్డిని కెలికిన రేవంత్‌


ఇక దీక్ష‌లే…
నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం వైఎస్సార్ టీపీ కొట్లాడుతుంది అని ఆ పార్టీ నేత‌లు హామీ ఇచ్చారు. “కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే నోటిఫికేషనులు గుర్తుకొస్తాయి, తర్వాత వాటి ఊసెత్తరు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే యువత ఎలా బతికేది. ప్రతి ఊరిలో ఉన్న నిరుద్యోగి గడప తొక్కుతాం. షర్మిల పార్టీ ప్రకటనతో కొంత మార్పు కనిపిస్తోంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ఏడేళ్లలో 14 కోట్ల జాబ్స్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్ని భర్తీ చేశారో, అందులో తెలంగాణ వాటా ఎంతో ఆ పార్టీ నేతలు చెప్పాలి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవాళ్లకు తప్ప ఇంకెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు’ అని ఇందిరా శోభన్ దుయ్యబట్టారు.


Share

Related posts

ఏపీ ఎమ్మెల్యేలను పట్టుకున్న కొత్త దిగులు ! ఏమిటో అది?

Yandamuri

మీ పిల్లల కు మార్కులు తక్కువ వస్తున్నాయని బాధ పడుతున్నారా?

Kumar

రక్షణ కోరిన బిందు,కనకదుర్గ

Siva Prasad