KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

Share

KCR: తెలంగాణ‌లో ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక , ఈ ఉప ఎన్నిక‌ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకోబోయే నిర్ణ‌యం హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న ప్ర‌క‌టించిన సంచ‌ల‌న ప‌థ‌కం అన్ని వ‌ర్గాల‌ల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌తిష్టాత్మ‌క ద‌ళిత బందు ప‌థ‌కం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ డిసైడ‌య్యారు. అయితే, దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ కు హుజురాబాద్ భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.

Read More: KCR: ఈట‌ల ఇలాకా నుంచి ఆ స్కీం ఆవిష్క‌రించి కొత్త గేమ్ మొద‌లుపెడుతున్న కేసీఆర్‌!

మాట మార్చిన కేసీఆర్‌…
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఏడేళ్లలో దళితులకు చేసిన మోసాల వ‌ల్లే కేసీఆర్ లో ఓటమి భయం పెరుగ‌తోంద‌న్నారు. భ్రమలు పెట్టడం కేసీఆర్ కు వెన్నతోపెట్టిన విద్యని.. 12 ఏళ్ళు దళితుడే ముఖ్యమంత్రి అని భ్రమల్లో పెట్టిన కేసీఆర్, అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరని ఒక చిన్న సాకుతో తప్పుకున్నాడన్నారు. మూడెకరాల భూ పంపిణి ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఆపేసిండని..దళిత బంధును కూడా అట్లనే ఆపేయగలడన్నారు. హుజురాబాద్ లో ఎలాగైనా గెలవాలనే కేసీఆర్ దళితబంధు ప్రకటన చేశారన్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం 21వేల కుటుంబాలున్నాయని..80 వేల మంది ప్రజలున్నారని తెలిపారు. దళిత ఓట్లు కీలకం కాబోతున్నాయని వారిని అక్కున చేర్చుకుంటున్నట్లుగా కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు హుజురాబాద్ జ్వరం రోజురోజుకు పెరుగుతుందన్నారు.

Read More : KCR: మోడీపై ఎందుకు ఈ మౌనం కేసీఆర్ సాబ్‌?

కేసీఆర్ స‌ర్వేల్లో ఏం తేలిందంటే..
ప్రతి దళిత కుటుంబానికి 10లక్షలు అంటూ పథకాన్ని తీసుకొచ్చి దళితుల మనోభావాలు ఎలా ఉన్నాయనే దానిపైనే సీఎం కేసీఆర్‌ సర్వేలు చేయిస్తున్నారన్నారు. 70 శాతం దళిత యువత వ్యతిరేకంగా ఉన్నారని.. ఏడేళ్లుగా కేసీఆర్ చేస్తున్న మోసాలపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారనే అంశం వారు నిర్వహించుకున్న సర్వేల్లో వస్తుందని చెప్పారు. ఈ ఎన్నిక ఫలితమే 2023 రిపీట్ అవుతుందనే భయం కేసీఆర్ కుందన్నారు. అందుకే రైతుబంధు నాటకంలాగే.. దళితబంధును ఎత్తుకున్నారన్నారు. రాజకీయ లబ్ది, ఓట్లకోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుందని.. హుజురాబాద్ లో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టే దళిత బంధుకు నిధులు ఎక్కడివో చెప్పాలన్నారు. హుజురాబాద్ లో మొదలుపెట్టి హుజురాబాద్ లో ముగించే పథకమో స్పష్టం చేయాలన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఎక్కడి నుంచి తీస్తున్నారో చెప్పాలని..సబ్ ప్లాన్ లో ఇచ్చిన నిధులు వాడుతున్నారా? అని ప్రశ్నించారు.


Share

Related posts

Today Gold Rate: పసిడి పరుగులకు బ్రేక్..!! దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella

బీజేపీ చలో అమలాపురం ఉద్రిక్తత.. నేతల గృహనిర్బంధాలు..అరెస్ట్ లు.. రాష్ర్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Special Bureau

Orange Melo pearl: మనవడి కి అదృష్టాన్ని ఇవ్వడానికి తాత ఏమి చేసాడో తెలుసా ??

Naina