KCR: హుజురాబాద్‌లో కేసీఆర్ స్కెచ్ పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Share

KCR: అసైన్డ్ భూముల ఆరోపణల తర్వాత కేసీఆర్‌ మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో హుజురాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ తెలంగాణ‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టికే ఈట‌ల సిద్ధ‌మైపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్ర‌చార ప‌ర్వంలో తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌కేసీఆర్ గురించి కీల‌క కామెంట్లు చేశారు.

Read More: KCR: మోడీపై ఎందుకు ఈ మౌనం కేసీఆర్ సాబ్‌?

ఈట‌ల ఏమంటున్నారంటే..

యావత్తు తెలంగాణ ప్రజలు హుజురాబాద్ వైపు చూస్తున్నారని మాజీ మ‌త్రి ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజలు గురుతరమైన బాధ్యత భుజాల మీద వేసుకొన్నారని పేర్కొన్నారు. ధర్మం, న్యాయం కాపాడటంలో, ఆహాంకారాన్ని ఓడించడంలో, ఆత్మ గౌరవం గెలిపించడంలో, పువ్వు గుర్తు గెలిపించడంలో ప్రజలు క్రియ శీలకంగా వ్యవహరించాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఎంత మందిని కొనుగోలు చేసినా, వందల కోట్లు ఖర్చు చేసినా ఇక్కడ ఎగిరేది కాషాయపు జెండా మాత్రమేన‌ని మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ధీమా వ్యక్తం చేశారు.

Read more: KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…

 

కేసీఆర్ అలాంటి ప‌నులు చేస్తున్నార‌ట‌…
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క హుజురాబాద్ నియోజక వర్గంలోనే కోట్ల రూపాయాలు ఇస్తామని, కుల సంఘం భవనాలు ఇస్తామంటూ మభ్య పెట్టడం సరికాదని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. టీఆర్ఎస్ నేత‌లు ఇంటింటికి లోన్లు ఇస్తాం, మహిళ సంఘాలకు సహాయం చేస్తాం అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఇన్ని ప్రలోభాలకు గురి చేసినా కేసీఆర్.. ఈటల రాజేందర్ ను మోసం చేసారనే విషయం ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఇంటలిజెన్స్, మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంటింటికి వెళ్తూ రాజకీయ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలాఉండ‌గా, దాదాపు 2 దశబ్దాల పాటు హుజురాబాద్ లో తిరుగులేని నేతగా ఉన్న ఈటల వంటి బలమైన నేతను తట్టుకుని గెలిచే సత్తా ఉన్న లీడర్ కోసం గులాబీ బాస్ కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు.


Share

Related posts

డివైడర్‌లకూ వైసిపి జండా రంగు

somaraju sharma

అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి సినిమా ఎదో తెలుసా?? డాడీ కాదు!!

Naina

నాయిని ఇంట మరో విషాదం..భార్య అహల్య కన్నుమూత

Special Bureau