NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

KCR: కేసిఆర్ కేజ్రీవాల్ కలిసి..!? తెలంగాణలో కొత్త ప్రణాళికలు..!

KCR: తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ బీజేపీకి వ్యతిరేకంగా చాలా అడుగులు ముందుకు వేశారు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు పలు పర్యాయాలు మీడియా సమావేశాలను నిర్వహించి బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేశారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీల భూమికను పోషించేందుకు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ ఠాకరే, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులను కలిశారు, చర్చించారు. పలు ప్రాంతీయ పార్టీలతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.

KCR new strotogy in telangana
KCR new strotogy in telangana

KCR: చంద్రబాబును మించిన చాణిక్యుడు

అయితే ఇప్పుడు తెలంగాణలోనే కేసిఆర్ కు కష్టాలు వచ్చే పరిస్థితి కనబడుతోంది. వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో..? రాదో అన్న అనుమానాలు ప్రారంభమైయ్యాయి. ఎందుకంటే.. రెండు సార్లు వరుసగా అధికారంలో ఉండటంతో సాధారణంగానే ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను పొగొట్టుకునేందుకే కేసిఆర్ ఇటీవల 90వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. లోకల్ సర్వేలు చూస్తున్నా మరల టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమేననీ, 40 నుండి 45 సీట్ల కంటే ఎక్కువ రావు అని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూస్తూ చూస్తూ కేసిఆర్ ఊరుకోరు కదా. తెలుగు రాష్ట్రాల్లో మంచి మాటకారి, మంచి తెలివితేటలు ఉన్న నాయకుడు కేసిఆర్, వాస్తవానికి చంద్రబాబు నాయుడునే చాణిక్యుడు అని అంటారు. చంద్రబాబును మించిన చాణిక్యుడు కేసిఆర్. రాజకీయ వ్యూహాలు వేయడంలో దిట్టగా కేసిఆర్ కు పేరుంది.

KCR: అప్ కు దేశ వ్యాప్త క్రేజ్

ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఫామ్ లో ఉంది. ఢిల్లీలో అధికారాన్ని కొనసాగిస్తూనే పంజాబ్ లోనూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పంజాబ్ లో గెలుపుతో అప్ కు దేశ వ్యాప్తంగా ఒక క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా విద్యావంతులు, అర్బన్ ప్రాంతాల్లో తటస్థులు ఆప్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో.. అందుకే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఆప్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 10 – 12 నియోజకవర్గాల్లో యూత్ ఓటర్లు ఆప్ పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ హైదరాబాద్ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో లోక్ సత్తా పార్టీకి మంచి ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది.

పొత్తు కోసం ఆరాటం

అందుకే ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కేసిఆర్ చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇంతకు ముందే కేసిఆర్ రెండు పర్యాయాలు అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే క్రమంలో కేజ్రీవాల్ తో కేసిఆర్ కలిశారు. ఇప్పటికే తెలంగాణలో పొత్తు అంశంపై కేసిఆర్ కేజ్రీవాల్ కు ప్రతిపాదన పంపినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఏపి నుండి కొన్ని పార్టీలు ఆప్ తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏపి కంటే కూడా ఆప్ కి తెలంగాణలోనే ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ టీమ్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ తో కేసిఆర్ కు ఉన్న పరిచయాల కారణంగా పొత్తు సాధ్యపడుతుందేమో చూడాలి మరి.

author avatar
Srinivas Manem

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk