Yaswanth sinha: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నేడు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్న వేళ కొద్ది గా ముందు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా నగరంలో ప్రచారానికి విచ్చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా మంత్రులతో కలిసి స్వాగతం పలకడంతో పాటు ర్యాలీలో పాల్గొనడం విశేషం. బేగంపేట నుండి జలవిహార్ వరకూ జరిగిన ర్యాలీలో సిన్హాతో కలిసి కేసిఆర్ పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా జలవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జల విహార్ లో యశ్వంత్ సిన్హా కు మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసిఆర్ ప్రసంగించారు. అక్కడే భోజనాలు చేస్తారు. అనంతరం యశ్వంత్ సిన్హా తనకు మద్దతు ఇచ్చే ఎంఐఎం పార్టీ నేతలతోనూ సమావేశం అవుతారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఆరు మాసాల్లో మూడు సార్లు హైదరాబాద్ నగరానికి వస్తే ఏ సందర్భంలోనూ ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసిఆర్ ప్రధాని మోడీకి స్వాగతం పలకలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని స్వాగత కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ యే ప్రభుత్వం తరపు స్వాగతం బాధ్యతలను కేసిఆర్ అప్పగించారు. ఈ తరుణంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించడంతో పాటు ఆయన వెంట వందలాది మంది కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న ర్యాలీలో కేసిఆర్ పాల్గొనడం, అంతే కాకుండా సిన్హా రాక సందర్భంగా బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్ లకు ధీటుగా భారీ ఎత్తున టీఆర్ఎస్ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పటికే హైదరాబాద్ లో ఫ్లెక్సీల పై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రగడ నడుస్తొంది. టీఆర్ఎస్ పోటీ ర్యాలీలు, సభలు, ఫ్లెక్సీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకపోయినా ఫరవాలేదు. కానీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాలేడన్నారు. బీజేపీ బలపడుతోందనీ, తమ కుర్చీ పోతుందని టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…