KCR: కేసీఆర్ నోటి వెంట ఆ మాట త‌ప్ప మ‌రోటి రావ‌ట్లేదుగా…

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖర్ రావు నోటి వెంట గ‌త కొద్దికాలంగా ఒక‌టే మాట వినిపిస్తుంద‌ని అంటున్నారు. ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా మాట్లాడుతున్నార‌ని చెప్తున్నారు. తాజాగా ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా తెలంగాణను రాష్ర్ట ప్ర‌భుత్వం తీర్చిదిద్దుతున్నదన్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగాల గురించి ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

Read More: KCR: మంచి చేసిన‌ కేసీఆర్… మండిప‌డుతున్న 60000 ఉద్యోగులు!

కేసీఆర్ ఏమంటున్నారంటే…
తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ స‌త్ఫ‌లితాలనిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప‌లు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని, తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతుంద‌ని అన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. పరిశ్రమలు ఐటి రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సీఎం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలిచ్చిందని, నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

Read More: KCR: ఉద్యోగాల భ‌ర్తీః మోడీ, కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదే

50000 ఉద్యోగాలే కాకుండా…
సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాలను గాడిలో పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచి, రైతు సహా సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుపరుస్తూ వస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడెమీ (టాస్క్) ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసామన్నారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు.

 


Share

Related posts

Katrina Kaif: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన హీరోయిన్ కత్రినా కైఫ్..!!

sekhar

బిగ్ బాస్ 4: నోయల్ హౌస్ నుండి బయటకు, గుక్కపెట్టి ఏడ్చిన హారిక..!!

sekhar

ఇలా అయితే మీరు సీఎం అయినట్లే పవన్ సార్..! అసలు ఇవేమి డిమాండ్లు..?

arun kanna