NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: బీపీ పెరుగుతోంది అంటూ కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం అనంత‌రం నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా టౌన్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ దళిత జాతిని దేశానికే ఆదర్శమైన దళిత జాతిగా చేసి చూపిస్తానని అన్నారు. చాలా మంది దళిత బంధు అమలు జరుగుతుందా అంటూ అవాకులు, చేవాకులు పేలుతున్నారని..గతంలో చేసిన ముఖమైతే ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే వారు కాదన్నారు. కేసీఆర్ ఒక్కసారి చెప్పాడంటే చేసి తీరుతాడు..గతంలో చెప్పినవన్నీ ఎలా చేసి చూపించానో మీ కళ్లముందే కనిపిస్తుందని ప్రజలను ఉద్దేశించి అన్నారు.

Read More : KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక‌.. కేసీఆర్ కు ఓ గుడ్ న్యూస్… ఇంకో బ్యాడ్ న్యూస్…

10 ల‌క్ష‌లు డైరెక్టుగా…

70 ఏళ్లుగా దళిత జాతిని ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. దళిత బంధు పథకాన్ని పెట్టాలని తనను ఎవరు అడగలేదని..ఎంతో మేధో మదనం చేసి ఈ పథకాన్ని రూపొందించానని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల వరకు దళిత కుటుంబాలుంటే అందులో 12 లక్షల వరకు దళిత కుటుంబాలు అర్హులుగా ఉంటారని వారందరికీ రూ. పది లక్షలు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన అందరూ దళితులకు ఈ పథకం ద్వారా రూ. 10 లక్షలు అందజేస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్దిదారులకు ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పెద్ద ఎత్తున దళిత బంధు కోసం నిధులు కేటాయిస్తామన్నారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్ని కోట్లైనా ఖర్చు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Read More : KCR: కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన కాంగ్రెస్ పెద్దాయ‌న‌

కేసీఆర్ ఏమంటున్నారంటే…
ప్రజల దీవెనలు ఉన్నన్ని రోజులు ప్రగతి బాటలో పయనిస్తామని…తెలంగాణ ప్రగతిని డైజెస్ట్ చేసుకోలేని వాళ్లు మాట్లాడే పిచ్చి మాటలు పట్టించుకోమని చెప్పారు. విద్యుత్, వ్యవసాయం, మిషన్ భగీరథ, సంక్షేమ కార్యక్రమాలు ఇలా చెప్పినవన్నీ చేసి చూపించానని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పినప్పుడు జానారెడ్డి లాంటి లీడర్ అది సాధ్యం చేస్తే టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానన్నాడని..కానీ అది చేసి చూపించాక మాట తప్పాడని గుర్తు చేశారు. ఆయనకు నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో మీరే బుద్ధి చెప్పారన్నారు. దళిత బంధు పథకాన్ని కూడా సక్సెస్ చేస్తామని చెప్పారు. కేసీఆర్ మొండిగా పట్టుపట్టడంతో చాలా మందికి బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందని..రాజకీయంగా సమాధి అవుతామని టెన్షన్ పడుతున్నారని విమర్శించారు.

author avatar
sridhar

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju