Eatela Rajendar: ఈట‌ల‌ను ఇరికించేందుకు ఆయ‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన కేసీఆర్

Share

Eatela Rajendar: హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరమైన అంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అనేక ట్విస్టుల త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నిలబెట్టింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం తమకేనంటూ ఈటల వర్గం చెబుతోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏ చాన్స్ వ‌దులుకోవ‌ద్ద‌ని చూస్తోంది. ఈ మేర‌కు తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల బ్యాలెన్స్ త‌ప్పుతున్నారా? ఏంటా మాట‌లు….

ఆయ‌న‌కు గుర్తింపు అందుకేనా….
మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజాగాయకుడు రసమయి బాలకిషన్ కు ఇటీవల రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి కేటాయించి నెల రోజులు కూడా గడవక ముందే కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ను ఓడించే క్రమంలోనే రసమయికి కేబినేట్‌ హోదా ఇచ్చినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read More: Eatela Rajendar: హుజురాబాద్ ప్ర‌జ‌లు ఈట‌ల‌ను ఎందుకు మెచ్చుకుంటున్నారో తెలుసా?


న‌మ్మ‌కం ఉన్న‌ప్ప‌టికీ లైట్ తీసుకోవ‌ద్ద‌నే…

రసమయి బాలకిషన్‌ కు కేబినేట్‌ హోదా కల్పిస్తూ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకోవ‌డం వెనుక ఈట‌ల‌ను టార్గెట్ చేయ‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని అంటున్నారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడిగా, తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మంలోనూ చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ కు మంచి పేరుంది. తొలినాళ్లలో విద్యార్ధి నాయకుడిగా కీలక పాత్ర పోషించిన ఆయన.. ఎమ్మెల్యేగానూ తన సత్తా చాటగలరని ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నమ్మకంగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏ ఒక్క చాన్స్ వ‌దులుకోవ‌ద్ద‌నే ఉద్దేశంతో ర‌స‌మ‌యికి ప‌ద‌వి ఇచ్చిన‌ట్లు చెప్తున్నారు.


Share

Related posts

Gold Price Today : ఈరోజు బంగారం, వెండి ధరలు..!!

bharani jella

తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కి ఇలాంటి క్వాలిటీస్ ఉంటే చాలు అంటున్న అరియనా..!!

sekhar

Mamata Banerjee: యోధురాలికి నేడే పరీక్ష..! మమతకు హ్యాట్రిక్ దక్కేనా..?

Muraliak