KCR Vs Etela: సీఎం కేసిఆర్ ఫోన్ కాల్ ఆడియో వైరల్..! కేసిఆర్ వ్యాఖ్యలపై ఈటల ఘాటు కౌంటర్ ఇదీ..!!

Share

KCR Vs Etela: హూజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ మారినా వ్యక్తిగతంగా తానేమిటో గెలిచి నిరూపించుకుంటానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉండగా, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచి తీరాలన్న దృఢ నిశ్చయంతో పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. సీఎం కేసిఆర్ ఈటలపై తొలి సారిగా స్పందించారు. కేసిఆర్ సర్కార్ ప్రతిష్టాత్మంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హూజూరాబాద్ నియోజకవర్గంలో మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

KCR Vs Etela: rajender reaction on kcr comments
KCR Vs Etela: rajender reaction on kcr comments

Read More: Huzurabad: హూజూరాబాద్ ఫైట్ ..షాకింగ్ సర్వే ఇదీ

ఈ క్రమంలో సీఎం కేసిఆర్ స్వయంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన దళిత నాయకుడు, ఎంపీటీసీ భర్త రామస్వామితో ఫోన్ లో మాట్లాడారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత నేతలతో ఈ నెల 26న సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంలో రామస్వామి ఈటలపై ఆరోపణలు చేశారు. తన పట్ల ఈటల వ్యవహరించిన తీరును సీఎం కేసిఆర్ కు రామస్వామి వివరించగా, ఈటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈటల చాలా చిన్నావాడని కేసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఈటల సీరియస్ స్పందించి కేటిఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసిఆర్ అంటున్నట్లు నేను చిన్న మనిషినే. కొట్లాడేవారంతా కేసిఆర్ దృష్టిలో చిన్నోళ్లే, ఆయనో పెద్ద మేధావి, పెద్ద మనిషి అనుకుంటాడు. కానీ బలవంతమైన సర్పం కూడా చలి చీమల చేత చిక్కిందని గుర్తుంచుకో అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం ఇల్లంతకుంట మండలం కనగర్తిలో పాదయాత్ర చేసిన సందర్భంగా కేసిఆర్ వ్యాఖ్యలపై ఈటల ఈ విధంగా మాట్లాడారు. కేసిఆర్ దృష్టిలో మేము చిన్న వాళ్లమే కావచ్చు కానీ రోషం గల బిడ్డలమని, చిచ్చర పిడుగుల్లా కొట్లాడే వాళ్లమని ఆయన అన్నారు. టీఆర్ఎస్ బీ ఫారం ఇస్తేనే గెలిచే వాళ్లు అయితే నీ బిడ్డ నిజమాబాద్ లో ఎందుకు ఓడిపోయిందంటూ కేసిఆర్ ను ఈటల ప్రశ్నించారు.

 


Share

Related posts

‘కథానాయకుడు కట్టు కధ!’

Siva Prasad

ఆ ఎంపీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో…??

somaraju sharma

YS Jagan: జ‌గ‌న్ మీద మ‌చ్చ పోతుందా… వివేకా హ‌త్య విష‌యంలో జ‌రిగేది అదేనా?

sridhar