NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. కలిసి వచ్చే పార్టీలు ఇవే..?

చాలా కాలంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, గత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, మాజీ పీఎం దేవగౌడ, ఎన్సీపి నేత శరద్ పవార్ తదితర నేతలతో భేటీ అయి జాతీయ రాజకీయాలపై చర్చించారు. అయితే వీరిలో ఎంతమంది నేతలు కెసిఆర్ తో కలసి ప్రయాణం చేస్తారు అనేది ఇంత వరకు స్పష్టత అయితే రాలేదు. కాకపోతే కొన్ని పార్టీల నుండి సానుకూల సాంకేతాలు రావడంతో జాతీయ పార్టీ ప్రకటనకు కెసిఆర్ సిద్దమయ్యారు.

CM KCR

దీనితో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు ఆదివారం తెర దించారు. విజయదశమి రోజున మధ్యాన్నం 1.19 గంటలకు పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు అయింది. ఆదివారం ముఖ్యమైన నేతలతో సమావేశం నిర్వహించి జాతీయ పార్టీపై చర్చించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనగా భవిష్యత్ కార్యాచరణ పై కసరత్తు చేసారు. పార్టీ ప్రకటన రోజు ఉదయం 11గంటలకు మరో సారి 283 మంది ముఖ్య నేతలతో సమావేశమై జాతీయ పార్టీ పై సంతకాలు చేయనున్నారు. తీర్మానం పై సంతకాల సేకరణ అయిన తర్వాత ఖరారు చేసిన ముహూర్తంలో జాతీయ పార్టీ ప్రకటన ను కెసిఆర్ చేయనున్నారు. ఈ మేరకు కెసిఆర్ క్లారిటీ ఇచ్చేసారు.

ఆదివారం నిర్వహించిన సమావేశంలో పార్టీ పేరుపై చర్చించారని చివరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు పై ఎక్కువ మంది మొగ్గు చూపారని అంటున్నారు. గులాబీ జెండా, కారు గుర్తు యధా విధిగా ఉంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని కెసిఆర్ ధీమాగా చెప్పారని అంటున్నారు. పార్టీ ప్రకటన తర్వాత డిసెంబర్ 9న దేశ రాజధాని ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కెసిఆర్ నిర్ణయించారుట. అదే విధంగా దేశ వ్యాప్తంగా పర్యటనలకు గాను 12సీట్ల చాపర్ (హెలికాప్టర్) కొనుగోలుకు ప్లాన్ చేసారని వార్తలు వినబడు తున్నాయి.

కన్నుల పండువగా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి సేవల ఫోటోలు ఇవే

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju