NewOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఐటీ అధికారుల తనిఖీలో కీలక సమాచారం .. మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్

Share

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, కళాశాలలు, బంధువుల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. మల్లారెడ్డికి చెందిన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు నివాసంలో నగదును అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. సుచిత్రలో త్రిశూల్ రెడ్డి నివాసం ఉంటున్నారు. త్రిశూల్ రెడ్డి మంత్రి మల్లారెడ్డికి సమీప బంధువు కాగా ఆయన కూడా కళాశాలలు నడుపుతున్నారు.

Mallareddy

మరో పక్క మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో ఉదయం నుండి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీపై ఆరోపణలు ఉన్నాయి. కన్వనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కళాశాలల బ్యాంకు లావాదేవీలను ఐటీ పరిశీలన చేస్తొంది. మెడికల్ కళాశాల లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలను అధికారులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి నివాసానికి పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగ్ లో సిబ్బంది దాచి పెట్టిన సెల్ ఫోన్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisements

మల్లారెడ్డి విద్యాసంస్థల లావాదేవీలను బాలానగర్ లోని ఓ ప్రాంతీయ బ్యాంకులో జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సదరు క్రాంతి బ్యాంకు చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన లావాదేవీలు అన్ని క్రాంతి బ్యాంకులో జరిగినట్లుగా అధికారుల వద్ద సమాచారం ఉండటంతో ఆ లావాదేవీలపై బ్యాంకు చైర్మన్ రాజేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు చైర్మన్ అయిన రాజేశ్వరరావు మంత్రి మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థల్లో భాగస్వామిగా కూడా వ్యవహరించినట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డికి వివిధ ప్రాంతంలో భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. మేడ్చల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయనీ, పన్నుల ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తొంది. రెండు రోజుల పాటు ఈ ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తొంది.

పోడు భూముల్లో ఉద్రిక్తత.. గుత్తి కొయల దాడిలో ఫారెస్టు ఆఫీసర్ మృతి


Share

Related posts

SBI Alert: వరుసగా మూడు రోజుల పాటు ఆ సేవలకు అంతరాయం..

bharani jella

మనుషులే కాదు.. , అవీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తాయి..!!

Special Bureau

పరిస్థితి చేయిదాటిపోతున్న ఆఖరి నిమిషంలో గౌతమ్ సవాంగ్ ని రంగంలోకి దింపిన జగన్!

CMR