Kodandaram: క‌త్తులు దూస్తున్న కోదండ‌రాం… షాకులు ఇస్తున్న సొంత టీం…

Share

Kodandaram: తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌ధాన భూమిక పోషించిన వారిలో ఒక‌రైన తెలంగాణ జ‌న స‌మితి నేత ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్పుడు ఒక‌రకంగా పొలిటిక‌ల్ క్రాస్ రోడ్స్‌లో ఉన్నార‌ని అంటున్నారు. రాజ‌కీయ పార్టీని స్థాపించిన ఈ ప్రొఫెస‌ర్ దాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డంలో స‌రైన వ్యూహం లేక‌పోవ‌డం వ‌ల్ల చ‌తికిల ప‌డుతున్నార‌ని అంటున్నారు. దానికి నిద‌ర్శ‌నం తాజా ప‌రిణామాల‌ని పేర్కొంటున్నారు.

Read More: KCR: పాత గుడ్ న్యూసే… మ‌ళ్లీ చెప్పిన కేసీఆర్‌

టీజేఎస్‌‌కు ఆ ముఖ్య నేత రాజీనామా
టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్‌‌గా పని చేస్తున్న పంజుగుల శ్రీశైల్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్‌‌ చేస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్‌‌ కోదండరామ్‌‌కు లెటర్‌‌‌‌ అందజేశారు. తెలంగాణ సమాజం కోసం రాజకీయంగా చేయాల్సినంత చేయలేకపోతున్నామని, టీజేఎస్ ఆ దిశగా పోవడం లేదన్నారు. పార్టీకి ఉద్యమ పంథానే ఉంది తప్పా, రాజకీయ ఆలోచన లేదని వాపోయారు.

Read More: Revanth Reddy: ఇటు కేటీఆర్‌ను అటు కిష‌న్ రెడ్డిని కెలికిన రేవంత్‌

కోదండ‌రాం కీల‌క ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ జన సమితి (టీజేఎస్)ని కాంగ్రెస్​లో విలీనం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అంతా వట్టి పుకార్లేనని టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. గతంలోనూ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్​లో విలీనం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్​లో టీజేఎస్ తరఫున క్యాండిడేట్ ను నిలబెడతామని చెప్పారు. టీజేఎస్​ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారని, ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవన్నీ సర్కార్ హత్యలేనన్నారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. టీజేఎస్ యాక్టివిటీస్ జిల్లా కేంద్రాల వరకే పరిమితమయ్యాయని, ఇకపై అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని తీర్మానం చేశామన్నారు. కాగా, ఓ వైపు కోదండ‌రాం క‌త్తులు దూస్తుంటే మ‌రోవైపు సొంత నేత‌లే ఆయ‌న‌కు గుడ్ బై చెప్పేస్తున్నార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.


Share

Related posts

కొత్త పాత్రలో చిరంజీవి..!! స్పెషల్ లుక్..సండే ఏం చేసారంటే..!!

DEVELOPING STORY

జగన్ పంతం × రాజ్యాంగం : గెలిచేది ఎవరో తెలుసు ప్రజాధనం వృథా తప్ప

Special Bureau

టిజి వ్యాఖ్యలు సరికాదు :చంద్రబాబు

Siva Prasad