CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దళపతి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇది మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా రాజకీయంగా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. విజయ్ బుధవారం సాయంత్రం ప్రగతి భవన్ కు వెళ్లి మరీ సీఎం కేసిఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ విజయ్ ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అయితే వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం, పీఎం మోడీకి వ్యతిరేకంగా సీఎం కేసిఆర్ ఇటీవల తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలను కలుపుకుని రాబోయే రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ తదితర నేతలను ఇంతకు ముందు కలిశారు. ఇక విజయ్ కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో విజయ్ కి మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది. ఈ ఫాలోయింగ్ తో తమిళనాట రాజకీయాలను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ గుడ్ విల్ యే సింబల్ గా పోటీ చేసిన అభిమానులు 128 పంచాయతీల్లో విజయం సాధించారు.
దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ ప్రభావం తమిళనాట తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇటు కేసిఆర్, అటు విజయ్ ఇద్దరూ బీజేపీకి వ్యతిరేకులు కావడంతో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ అంశాలు ఏమి లేకపోతే సీఎం కేసిఆర్ ఓ సినీ స్టార్ కు అపాయింట్మెంట్ ఇచ్చి మరీ కలవాల్సి అవసరం లేదన్న టాక్ నడుస్తోంది. వీరి భేటీకి సంబంధించి రాజకీయ ప్రాధాన్యత ఉందా లేదా అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…