NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రూ.2 వేల కోట్లు ఇస్తే అంటూ సంచలన వ్యాఖ్యలు..

Komatireddy Rajagopal Reddy sensational comments

Komatireddy Rajagopal Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కింది. టీఆర్ఎస్ ను వీడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేయనుండటంతో అధికార టీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో లబ్దికోసం టీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటిస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై తాజాగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Komatireddy Rajagopal Reddy sensational comments
Komatireddy Rajagopal Reddy sensational comments

Read More: Ramappa Temple: బిగ్ బ్రేకింగ్ ..చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు..! ఫలించిన తెలంగాణ ప్రభుత్వ కృషి..!!

 

ఉప ఎన్నికలు ఉన్నందునే హుజూరాబాద్ నియోజకవర్గంలో వేల కోట్లను ఖర్చు చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. మునుగోలు నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు ఇస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఎన్ని మార్లు అడిగినా ఇవ్వలేదనీ, కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు మాత్రమే నిధులు ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

 

హూజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్న దళిత బంధు పథకంపై ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు హుజూరాబాద్ లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో వంద కుటుంబాలకే సాయం చేస్తామనడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలపై సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. ఇటీవలే హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.35కోట్లు కేటాయించారు. పలువురు మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న దళిత బంధు పథకం కింద రూ.1500 నుండి 2వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇంతకు ముందే సీఎం కేసిఆర్ వెల్లడించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju