NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

బీసీ… ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ “రేఖ” మార్చాగలరా??

 

 

కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పూర్తి స్వరూపాన్ని మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే నానాటికీ దిగజారుతున్న పార్టీ పరిస్థితిని అంచనా వేస్తూ మొత్తం పార్టీని…. పిసిసి కూర్పు బలమైన నేతలతో నింపి అన్ని వర్గాలను సమతూకంగా ఉంచేలా చూస్తోంది. దీనిలో భాగంగా ఫైర్బ్రాండ్ నేతలుగా పేరున్న వారిని.. కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్ళిన విజయశాంతి డీకే అరుణ లాంటి మహిళా నేతలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్లో ఇప్పటివరకు కీలకంగా ఉన్న మహిళా నేతల గురించి ఆలోచిస్తోంది. పాత మొహాలు అన్నిటినీ పక్కనబెట్టి పూర్తిగా కొత్త వారితో నింపేందుకు కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉంది.

 

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి దాదాపుగా తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించాలనే నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. ఆయనకు సహకరించి అన్ని విధాలా పార్టీని ముందుకు నడిపించే.. అనుకూలంగా ఉండే నేతలకు తెలంగాణ పీసీసీలో కీలకమైన పదవులు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాత కాంగ్రెసు నాయకుల వల్ల కానిదాన్ని కొత్తగా పార్టీలోకి వచ్చినవారితో పీసీసీని ఏర్పాటు చేసి పార్టీని తెలంగాణలో బలోపేతం చేసి సాధించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  తుది దశలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ పీసీసీపీఠం ఖాయమే.

మహిళ… బీసీ… ఫైర్ బ్రాండ్

తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి ఇటీవల పార్టీలోకి వచ్చిన వరంగల్ కు చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోందిది. పార్టీని వదిలిపెట్టిన డికె అరుణ, విజయశాంతిలకు ధీటుగా మహిళా నాయకురాలిని ముందు పెట్టాలనే ఆలోచనలో భాగంగానే కొండా సురేఖ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొండా సురేఖ… మహిళా నేతలకు అంతే దీటుగా సమాధానం చెప్పగలరు. మహిళా నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పార్టీ ఇమేజ్కు బలం చేకూరుతుంది.
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో తనను విస్మరించారని ఆవేదన చెందుతున్న సీతక్కను మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలి పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహిళా కాంగ్రెసు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
** కాగా, మహిళా అధ్యక్షురాలి పదవి కోసం సునీతారావు, సుజాత పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలిగా ఉన్న నేరెళ్ల శారదకు, మరో ేత ఇందిరా శోభన్ లకు కమిటీల్లో కీలక పదవులు అప్పగించే అవకాశం ఉంది. మైనారిటీ వర్గానికి చెందిన ఉజ్మా షకీర్ కు కూడా తగిన స్థానాన్ని కల్పించే అవకాశం ఉంది.

author avatar
Comrade CHE

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju