తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila Party: ఏపిలో షర్మిల పార్టీ..? అసలు క్లారిటీ ఇచ్చేసిన ఆ పార్టీ ముఖ్యనేత..!!

Share

YS Sharmila Party: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్ తో విభేదాల కారణంగా ఏపిలోనూ రాజకీయ పార్టీ పెట్టనున్నారంటూ వస్తున్న వార్తలపై వైఎస్ఆర్ టీపీ ముఖ్యనేత క్లారిటీ ఇచ్చారు. ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల తనకు అలాంటి ఆలోచన లేదనీ గానీ వస్తున్న వార్తలు పుకారు మాత్రమే అని ఖండించకుండా పార్టీ పెట్టకూడదని రూల్ ఏమైనా ఉందా అంటూ ఎదురు ప్రశ్నించారు. షర్మిల అలా అనడం వల్ల రకరకాల వూహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ టీపీ ముఖ్య అధికార ప్రతినిధి హోదాలో కొండా రాఘవరెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

Konga raghavareddy clarifies on YS Sharmila Party
Konga raghavareddy clarifies on YS Sharmila Party

YS Sharmila Party: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ కోసమే

తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలు, కొత్త 33 జిల్లాల పరిమితంగానే తాము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ఏడున్నర సంవత్సరాల కేసిఆర్ ను రాజశేఖరరెడ్డి పాలనను పోల్చుకుంటే ప్రజలు ఇబ్బందుల పాలు అవుతున్నారని, విద్యార్ధులు చనిపోతున్నారు. నాడు తెలంగాణ కోసం విద్యార్ధులు అసువులు బాస్తే ఇప్పుడు కొలువల కోసం అసువులు బాస్తున్నారు కనుక తెలంగాణలో రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన తీసుకురావాలన్న ఉద్దేశంతోనే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

కుటుంబాల్లో విబేధాలు సహజం

కుటుంబాలు అన్న తరువాత విభేదాలు సహజమని, అంబానీ లాంటి పెద్ద కుటుంబాల్లోనూ విభేదాలు ఉంటాయి. సమసిపోతాయి. ఒకరి దగ్గరకు వస్తారు, ఒకటై పోతారు అని రాఘవరెడ్డి అన్నారు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు వారి వ్యక్తిగత కుటుంబ విషయాలను ఎవరో వచ్చి చెవిలో చెప్పినట్లు, యుద్దం జరిగినట్లు, కొట్లాడుకున్నట్లు, కొట్టుకున్నట్లు, పార్టీ లు పెడుతున్నట్లు విభేదాలను పెద్దగా సినిమా స్కోప్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కుటుంబానికి ఆప్తుడిగా చెప్పుకున్న ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు.

Read More: 1.Cheating: ఆ ఆలయ ఇఓ అవినీతిపై మంత్రి వెల్లంపల్లికి ఫిర్యాదు..?

2.JP Nadda: హైదరాబాద్ నడిబొడ్డులో..కేసిఆర్ కి వణుకు తెప్పించే ప్రకటన చేసిన జేపి నడ్డా..

3. BJP Vs TRS: కేసిఆర్ పై పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీ అమలు చేస్తున్న బీజేపీ..? ‘దీదీ’లా తట్టుకుంటారో లేదో..!?


Share

Related posts

Shyam Singha Roy టీజర్ వచ్చేసింది : ఒళ్ళు గగుర్పొడిచేలా చేశావ్ కదయ్యా నాని

amrutha

ఏడు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ పై ఎన్ఐఏ దాడులు .. వంద మందికిపైగా అరెస్టు..?

somaraju sharma

ఐఎఎస్ ల భేటీ వాయిదా

somaraju sharma