Koushik Reddy: గత కొద్దికాలంగా హుజురాబాద్ నియోజకవర్గం నేత కౌశిక్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నేత అయిన కౌశిక్‌రెడ్డి ఓ ఆడియోతో మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అయితే, తాజాగా కౌశిక్ రెడ్డి మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఎపిసోడ్‌తో కౌశిక్ రెడ్డి అమాయకుడా? తెలివైనోడా? అన్న చర్చ జరుగుతోంది.
Read More:Eatela Rajendar: హుజురాబాద్‌లో ఇంటెలిజెన్స్ సర్వే… ఈటల గురించి ఏం తేలిందంటే…
కౌశిక్ ఆడియో కలకలం…
హుజురాబాద్ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే స్థానిక నాయకుడికి కౌశిక్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ వైరల్ గా మారింది. స్థానికంగా వైరల్ అవుతున్నఈ ఆడియోలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నట్లు కౌశిక్ రెడ్డి చెప్పుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నా అని చెబుతున్నారు. మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుస్తానంటూ కాంగ్రెస్ నాయకులను తన వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండటం తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ నాయకులకు ఫోన్లు చేస్తూ కౌశిక్ రెడ్డి మద్దతు కోరుతున్న ఆడియో సహజంగానే చర్చనీయాంశంగా మారింది.
Read More:KCR: ఉప ఎన్నికకు అప్పుడే ఎత్తుగడ వేసేసిన కేసీఆర్
కౌశిక్ అమాయకుడా? తెలివైనోడా?
కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పీసీసీ రథసారథి రేవంత్ రెడ్డి పై ఆయన సంచలన కామెంట్లు చేశారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి కారణం కౌశిక్ పేరుతో వైరల్ యిన ఆడియో. తాజాగా మళ్లీ అదే రీతిలో ఓ ఆడియో వైరల్ అవుతుండటంతో..ఇలాంటి పరిణామాలను అంచనా వేయలేనంత అమాయకుడా కౌశిక్ రెడ్డి అని పలువురు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో మీడియాలో, వార్తల్లో ఎలా నిలవాలో తెలిసిన తెలివైన వ్యక్తి అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.