జాతీయం తెలంగాణ‌ బిగ్ స్టోరీ

Tesla Ktr: టెస్లా కోసం కేటీఆర్.. ఆయన వెంటే సెలబ్రిటీలు..!

ktr and celebrities for tesla cars
Share

Tesla Ktr: ‘ఎలాన్ మస్క్’.. ఈ పేరు ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల్లో మారోమోగిపోతూ ఉంటుంది. ఆయన కంపెనీ నుంచి వస్తున్న ‘టెస్లా’ కార్లు ఇప్పుడు హాట్ టాపిక్. ఈ కార్లు దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టాలనేది ఆయన ఆలోచన. అయితే.. ఇటివల ఆయన టెస్లా ఇండియాలో ఎందుకు ఆలస్యమవుతున్నాయో కారణం చెప్తూ.. ‘భారత ప్రభుత్వంతో ఎదురవుతున్న సవాళ్ల కారణంగానే అక్కడ ‘టెస్లా’ రాక ఆలస్యం అవుతోంది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి’ అని చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారాన్నే రేపింది. దీనికి కేంద్రం కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. అయితే.. ఈ అవకాశాన్ని దక్కించుకునేలా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. కేటీఆర్ కు సినీ సెలబ్రిటీలు, జర్నలిస్టులు కొందరు ప్రముఖులు మద్దతివ్వడం విశేషం.

ktr and celebrities for tesla cars
KCR tweets asking Elon Musk to invest in Telangana and promised that the government of Telangana is very supportive of industries and that Hyderabad is emerging as a top investment destination in India.

హైదరాబాద్ కు రండి..

డియర్ ఎలాన్.. ‘టెస్లా కార్ల పరిశ్రమ హైదరాబాద్ లో పెట్టండి. తెలంగాణలో అవకాశాలు ఎక్కువ. ఇక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తుంది. వ్యాపారాలకు అనువుగా తెలంగాణ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉంది’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ దేశీయంగా ఎంతో సంచలనం రేపింది. దీంతో పలువురు సెలబ్రిటీలు హైదరాబాద్ లో పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ (Tesla Ktr) కేటీఆర్ ట్వీట్ కు అనుగుణంగా ట్వీట్స్ చేశారు. ఇందులో టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్, దర్శకుడు గోపీచంద్ మలినేని, మెహర్ రమేశ్, హీరోయిన్ జెనీలియా.. తదితరులు స్పందించారు. ‘ఎలాన్.. హైదరాబాద్ రండి. టెస్లా పెట్టండి. అనువైన స్థలంతోపాటు ప్రభుత్వం అండ ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.

స్పందన వస్తుందా..

కేటీఆర్ ట్వీట్ తో టెస్లా కార్లకు మరింత ప్రాచుర్యం దక్కింది. దీనికి తోడు కేటీఆర్ గతంలో తన అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు టెస్లా కార్లు నడిపిన ఫోటోలు కూడా ట్వీట్ చేయడంతో మరింత ఆకర్షించింది. ప్రస్తుతానికి దీనిపై ఎలాన్ నుంచి ఎటువంటి స్పందన లేకపోయినా దేశంలో ఓ రాష్ట్రం నుంచి టెస్లాకు ఆహ్వానం అందడం మాత్రం విశేషం. విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాల్ని తగ్గించాలని గతేడాది భారత్ ను టెస్లా కోరగా.. ముందు దేశీయంగా కార్ల ఉత్పత్తి ప్రారంభించాలని భారత్ కోరింది. ఇలా ఏర్పడిన ప్రతిష్టంభననే ఎలాన్ ప్రస్తావించారని చెప్పాలి. అయితే.. (Tesla Ktr) కేటీఆర్ ట్వీట్ మాత్రం ప్రభుత్వ, పారిశ్రామికవర్గాల్లో చర్చనీయాంశమైందనే చెప్పాలి.

 


Share

Related posts

ఢిల్లీలో జగన్ – కేసీఆర్..! అమిత్ షా పెద్ద షాకే ఇవ్వబోతున్నారు..!?

Srinivas Manem

Balakrishna : బావన, బావమరిదికి వరుస అవమానం!!

Comrade CHE

సిట్ “స్టాండ్” పెరగాలి…!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar