మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ సమావేశమైయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో వీరి భేటీ జరిగింది. తెలంగాణలో పెట్టుబడులపై సత్యనాదెండ్లతో మంత్రి కేటిఆర్ సుదీర్ఘంగా సమావేశమైయ్యారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సత్యనాదెండ్ల సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు.

తెలంగాణ ఐటీకి అనుకూలంగా ఉండటం, హైదరాబాద్ లాంటి నగరంలో ఇందుకు అనుకూలమైనదిగా మారడంతో పెట్టుబడులు పెట్టాలని సత్యనాదెండ్లను ఈ సందర్భంగా కేటిఆర్ కోరినట్లు చెబుతున్నారు. ఇందుకు సత్యనాదెండ్ల కూడా అంగీకరించినట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే సత్యనాదెండ్లతో భేటీ పై మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సత్యనాదెండ్లతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవేళటి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సత్యనాదెండ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించానని క్లుప్తంగా పేర్కొన్నారు.
ఢిల్లీ మేయర్ ఎన్నికలో గందరగోళం ..బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల మధ్య తోపులాట
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
— KTR (@KTRTRS) January 6, 2023